1 సారి తాగితే దగ్గు,గొంతు నొప్పి,జలుబు,గొంతులో గరగర,ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయి
Cold home remedies in telugu : వర్షాకాలం ప్రారంభమైంది ఈ సీజన్ లో జలుబు, గొంతు నొప్పి, గొంతులో గరగర, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి వచ్చాయంటే ఒక పట్టానా తగ్గవు. వీటిని తగ్గించుకోవడానికి మందులను వాడుతూ వంటింట్లో ఉండే కొన్ని ఆహారాలను తీసుకుంటూ ఉంటే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
అవిసె గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జలుబును తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీళ్లు కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ అవిసె గింజల పొడి వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వరకట్టాలి.. ఆ నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం. ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే జలుబు, గొంతు నొప్పి వంటి సమస్య నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది
క్యారెట్ కూడా జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకు సహజసిద్ధమైన మెడిసిన్ గా పనిచేస్తుంది. క్యారెట్ లో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జలుబు., గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ ఇలా సమస్యలు ఉన్నప్పుడు ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తీసుకుంటే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. క్యారెట్ జ్యూస్ శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి జలుబు తగ్గటానికి సహాయపడుతుంది.
మనం మసాలా దినుసుగా ఉపయోగించే దాల్చిన చెక్క కూడా చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది..దీని కోసం పొయ్యిమీద ఒక గ్లాసు నీటిని పెట్టి కాస్త వేడెక్కాక అంగుళం దాల్చిన చెక్క ముక్క లేదా పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మరిగించాలి ఇలా మరిగించడం వలన దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు అన్ని నీటిలోకి చేరతాయి. ఈ నీటిని ఒక గ్లాసులో వడగట్టి ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే సరిపోతుంది.
వండింట్లో ఉండే ఈ సహజ సిద్ధమైన పదార్థాలతో చాలా సులభంగా సీజనల్ గా వచ్చే ఇటువంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే మన ఆరోగ్యాన్ని చాలా సులభంగా కాపాడుకోవచ్చు. ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే దగ్గు,గొంతు నొప్పి,జలుబు,గొంతులో గరగర,ఆస్తమా వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.