ఈ దుంపలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో…ముఖ్యంగా మతిమరుపు ఉన్నవారికి…
Health benefits of kanda : కందలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కందను కోసినప్పుడు చేతులు దురద పెడుతూ ఉంటాయి. అందుకే చాలామంది కందను తినటానికి ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా తినడానికి ప్రయత్నం చేస్తారు. డయాబెటిస్ ఉన్నవారు., అధిక బరువు ఉన్నవారు, గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది
దీనిలో ఉండే విటమిన్స్, ఫైటో న్యుట్రియన్స్ వంటివి ఎటువంటి సమస్యలు లేకుండా కాపాడతాయి. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. అలాగే శరీరంలో .రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్స్ తో పోరాటం చేసే సామర్థ్యాన్ని శరీరానికి అందిస్తుంది. విటమిన్ b6 ఉండే ఆహారాలను వారంలో రెండు సార్లు తప్పనిసరిగా తినాలి.
ఇటువంటి ఆహారాలను తీసుకోవడం వలన శరీరంలో ఎర్ర రక్త కణాలు బాగా పెరుగుతాయి. అలాగే మన శరీర చర్మాన్ని రక్షిస్తుంది. కందలో b6 చాలా సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా జీర్ణసంబంధ సమస్యలైన గ్యాస్ట్రిక్., స్టొమక్ అప్సెట్ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.
ఒకప్పుడు మతిమరుపు అనేది వృద్ధాప్యంలో వచ్చే సమస్య కానీ ఈ రోజుల్లో 30 నుంచి 40 ఏళ్ల వయసు వచ్చేసరికి రోజులో ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మతిమరుపు అనేది నిదానంగా ప్రారంభమై చివరకు తీవ్రమైన సమస్యగా మారుతుంది. కాబట్టి ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంద తీసుకుంటే మతిమరుపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. .
వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్., మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గితే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి .కనీసం వారానికి ఒకసారి తప్పనిసరిగా కంద తీసుకుని మతిమరుపు నుంచి బయటపడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.