1 గ్లాసు తాగితే మూత్రంలో మంట, నొప్పి, యూరిన్ ఇన్ ఫెక్షన్, శరీరంలో వేడి అనేది ఉండదు

urinary tract infection Home remedies : యూరినరీ ఇన్‌ఫెక్షన్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ అంటే హానికరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి ప్రవేశించడం వల్ల వస్తుంది. అంటే హానికరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోని ఏదైనా ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు అది ఇన్ఫెక్షన్ మరియు వాపుకు గురవుతుంది. మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ సర్వసాధారణం.

దీని కారణంగా పొత్తి కడుపులో మంట, మూత్రం రంగు మారటం, ఎక్కువసార్లు ముత్రానికి వెళ్ళటం వంటి లక్షణాలు కనపడతాయి. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా త్వరగా తగ్గుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బియ్యం నీరు యూరినరీ ఇన్‌ఫెక్షన్ తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. బియ్యం నీటిని తయారుచేశాక 6-8 గంటలు మాత్రమే నిల్వ ఉంటాయి. బియ్యం నీటిని ఎలా తయారుచేయాలో చూద్దాం. అరకప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీటిని పోసి అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత ఒక సారి చేత్తో మొత్తం తిప్పి ఆ నీటిని వడగట్టాలి. రోజుకి ఒక గ్లాసు బియ్యం నీరు తాగాలి.
dhaniyalu
ధనియాలు కూడా యూరినరీ ఇన్‌ఫెక్షన్ తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ధనియాలను వేసి అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ విధంగా తాగితే క్రమంగా యూరినరీ ఇన్‌ఫెక్షన్, మూత్రంలో మంట అన్ని తగ్గుతాయి. శరీరంలో పైత్యం కూడా తగ్గుతుంది.
usiri benefits in telugu
ఉసిరి రసం రోజూ తాగితే ఆరోగ్యానికి మంచిది. ఉసిరికాయలో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రెండు ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మిక్సీ చేయాలి. ఆ తర్వాత ఒక కప్పు నీటిని పోసి మరల మిక్సీ చేసి వడకట్టి తాగాలి. ఈ మూడు డ్రింక్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఏదో ఒక డ్రింక్ ని రెగ్యులర్ గా తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.