యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి….ముఖ్యంగా ఈ సీజన్ లో…

Uric acid avoid Foods : ఈ రోజుల్లో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో అంటే ఈ వర్షాకాలంలో యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
uric acid
యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే కడుపులో మంట, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, చేతుల వేళ్ళ వాపు సమస్యలు, కిడ్నీలో రాళ్లు వంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించుకోకపోతే కిడ్నీ, లివర్ సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం కూడా ఉంది. .
black beans
అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ లో నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. బీన్స్ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలును చేస్తుంది. అయితే యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు బీన్స్ కి దూరంగా ఉంటేనే మంచిది. .

ఎందుకంటే బీన్స్ లో ఉండే ప్యూరిన్ యూరిక్ యాసిడ్ సమస్యలను పెంచుతాయి. అలాగే శరీరంలో మంట కూడా పెరుగుతుంది. బటానీలో ప్యూరిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నప్పుడు బఠానీలు తినకుండా ఉండటమే మంచిది.

వంకాయలో కూడా ప్యూరిన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల వంకాయ తినటం వలన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు బాగా పెరుగుతాయి. దాంతో శరీరంలో మంట కూడా ఏర్పడుతుంది. అంతేకాకుండా ముఖం మీద దద్దుర్లు., దురద వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండటమే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.