Healthhealth tips in telugu

1 గ్లాస్ ఎంతటి వేలాడే పొట్ట,నడుము,తొడల చుట్టూ ఉన్న కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

Flax Seeds Weight Loss Drink : ఈ రోజుల్లో మనలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే బరువు కచ్చితంగా తగ్గాలి. బరువు తగ్గాలంటే మంచి పోషకాహారం తీసుకుంటూ రోజులో అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కాని పాటిస్తే చాలా సులభంగా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

దీనికోసం మనం ఒక పౌడర్ తయారు చేసుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి ఒక కప్పు అవిసె గింజలు వేసి వేగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ మెంతులను వేసి వేగించాలి. ఒక మిక్సీ జార్ లో వెగించిన అవిసె గింజలు, మెంతులు, వాము, ఒక స్పూను సైంధవ లవణం వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.
Joint Pains Home Remedies in telugu
ఈ పొడి దాదాపుగా 15 రోజులు పాటు నిల్వ ఉంటుంది. గాలి చొరబడని సీసాలో నిలువ చేసుకుంటే సరిపోతుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీరు కాస్త వేడెక్కాక అర స్పూన్ పొడి వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి టీ తాగినట్టుగా కొంచెం కొంచెంగా తాగాలి. .
ajwain seeds and kidney stones
ఈ విధంగా ప్రతిరోజు తాగుతూ ఉంటే 15 రోజుల్లో తేడా కచ్చితంగా కనబడుతుంది. బరువు అనేది ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గాలి. ఒక్కసారిగా బరువు పెరగకూడదు…అలాగే తగ్గిపోకూడదు. అవిసె గింజలలో ఉండే లక్షణాలు జీవక్రియ రేటును పెంచి బరువు తగ్గించడంలో సహాయపడతాయి
వాము శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా జీర్ణ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. బరువు తగ్గించడంలో జీర్ణ ప్రక్రియ కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది.
Weight Loss tips in telugu
అలాగే మెంతులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తాయి. గ్యాస్., ఎసిడిటీ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి. ఇప్పుడు చెప్పిన ఈ పొడి డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అధిక బరువు, డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు ఈ పొడిని తీసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అయితే ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తించుకోవాలి. ప్రతిరోజు కనీసం అరగంట వ్యాయామం చేస్తేనే ఫలితాలు అనేవి చాలా తొందరగా వస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.