ఈ ఆహారాలను తీసుకుంటే రక్తం శుద్ది అవ్వటమే కాకుండా రక్తహీనత సమస్య కూడా ఉండదు
How to Clean Your Blood : మన శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే శరీరంలోని నరాల ద్వారా ప్రవహించే రక్తం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రధానంగా మనం రోజూ తినే ఆహారంలో లభించే పోషకాలన్నీ మన అవయవాలన్నింటికి చేరేలా చేసే పనిని మన శరీరంలోని రక్తం చేస్తుంది.
శరీరంలో ప్రతి అవయవం సక్రమంగా పనిచేయాలంటే రక్తం శుద్దిగా ఉండాలి. రక్తంలో మలినాలు ఉంటే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలసట, నీరసం,తలనొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే రక్తహీనత సమస్య కూడా వస్తుంది. రక్తాన్ని శుద్ది చేయటానికి కొన్ని ఆహారాలను తీసుకోవాలి.
తులసి ఆకులు కూడా రక్తాన్ని శుద్ది చేస్తాయి. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ప్రతి రోజు మూడు లేదా నాలుగు తులసి ఆకులను ఖాళీ కడుపుతో నమలడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా రక్తంలోని విష పదార్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
నీటిని ఎక్కువగా తాగటం వలన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటకు వెళ్లడమే కాదు, శరీరంలో ప్రవహించే రక్తం కూడా శుద్ధి అవుతుంది. బీట్రూట్ రక్తాన్ని శుద్ది చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది. బీట్ రూట్ లో విటమిన్ సి, మాంగనీస్, పొటాషియం, ఐరన్, క్యాల్షియం, విటమిన్ బి6, నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వారంలో ఒక్కసారైనా బీట్ రూట్ ని ఆహారంలో బాగంగా చేసుకుంటే రక్తం శుద్ది అవ్వటమే కాకుండా రక్తహీనత సమస్య కూడా ఉండదు.
బెల్లంలోని జింక్ మరియు సెలీనియం కంటెంట్ కారణంగా, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడుతుంది. మనం ప్రతి రోజూ తాగే టీ,కాఫీలో పంచదారకు బదులు బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ఉండటమే కాకుండా రక్త ప్రసరణ మెరుగుపడి రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.