ప్రతి రోజు వెల్లుల్లి తింటున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు తింటే…ఏమి అవుతుందో…?

Garlic Side Effects In telugu : వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది వెల్లుల్లి వాసన కారణంగా తినరు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా తినటానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయుర్వేదంలో వెల్లుల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
garlic
వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి కొన్ని సమస్యలు ఉన్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండటం మంచిది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు ఉండుట వలన వెల్లుల్లి శరీరం నుండి బ్యాక్టీరియాను తొలగిస్తుందని మరియు హెపటైటిస్ సమస్యను తగ్గిస్తుందని అందరూ భావిస్తారు.

కానీ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కడుపు మరియు ప్రేగులలోని గ్యాస్ట్రిక్ యాసిడ్ తగ్గుతుంది. శరీరంలోని జీర్ణ శక్తిని తగ్గిస్తుంది. వికారం మరియు వాంతులు కలిగిస్తుంది. కాలేయ సమస్యలు ఉన్న వారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. విరేచనాల సమస్యతో బాధపడుతున్నవారిలో ఆ సమస్యను తీవ్రతరం చేస్తుంది.
Garlic Benefits in telugu
ఏదైనా శస్త్రచికిత్స అవసరం అయినప్పుడు రెండు వారాల ముందు వెల్లుల్లిని తీసుకోవడం మానేయాలి. వెల్లుల్లిపాయలు తినే సమయంలో సర్జరీ చేస్తే రక్తస్రావం పెరిగి రక్తం గడ్డకట్టడం సాధ్యం కాదని నిపుణులు చెప్పుతున్నారు. గర్భిణీ స్త్రీలు వెల్లుల్లిని మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే
గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

వెల్లుల్లి రక్తపోటును తగ్గిస్తుంది. కాబట్టి రక్తపోటు సమస్య ఉన్నప్పుడు మందులు వాడేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కంటి సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే కంటి నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. దీంతో కంటి చూపు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.