Healthhealth tips in telugu

గర్భధారణ సమయంలో నల్ల ఎండు ద్రాక్ష తింటే ఏమి అవుతుందో తెలుసా?

Raisins during pregnancy : గర్భధారణ సమయంలో తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో కొణతమందికి కొన్ని ఆహారాలను ముఖ్యంగా తీపి పదార్ధాలను తినాలనే కోరిక కలుగుతుంది. అలాగే గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష తింటే ఏమి అవుతుందో తెలుసుకుందాం.
black raisins
ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు,ఐరన్ సమృద్దిగా ఉండుట వలన తీపి తినాలనే కోరికను ఎండుద్రాక్షను తిని తీర్చుకోవచ్చు. గర్భధారణ సమయంలో ఏది అతిగా తినకూడదు. లిమిట్ గా తింటే ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ఎండుద్రాక్షలో ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ సమృద్దిగా ఉండుట వలన అలసట,నీరసం లేకుండా హుషారుగా,చురుకుగా ఉండటానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

ఎముకలు మరియు కండరాలు బలపడతాయి. గర్భధారణ సమయంలో సాదరణంగా మలబద్దకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎండుద్రాక్ష లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన ప్రేగు కదలికలను ప్రేరేపించి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్దకం లేకుండా చేస్తుంది. ఎండుద్రాక్షలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.

గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష తినడం వల్ల ఐరన్ లోపాన్ని తీర్చడంతో పాటు రక్తహీనతను నివారిస్తుంది. దీనితో పాటు, ఎండుద్రాక్షలో విటమిన్ సి కూడా ఉంటుంది, ఇది రక్తహీనత నివారణలో మరింతగా సహాయపడుతుంది. ఎండుద్రాక్షలో ఫోలేట్ ఉండటం వల్ల శరీరంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో సహాయపడి ఎర్రరక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
blood thinning
ఎండుద్రాక్షలో క్యాల్షియం మరియు ఐరన్ సమృద్దిగా ఉండుట వలన బిడ్డ ఎముకలు దృఢంగా ఉంటాయి. మార్నింగ్ సిక్ నెస్ మరియు ఆకలి లేకపోవటం అనేవి గర్భధారణ సమయంలో సాదరణంగా ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది. ఎండుద్రాక్షలో ఫైబర్, పొటాషియం మరియు మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన ఆకలిని పెంచటమే కాకుండా మార్నింగ్ సిక్ నెస్ ని తగ్గిస్తుంది.

గర్భధారణ సమయంలో వచ్చే చిగుళ్ల వాపును తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలో విటమిన్ ఎ ఉండటం వల్ల దృష్టిని మెరుగుపరచడమే కాకుండా బిడ్డ కంటి చూపుకు సంబంధించిన వ్యాధులు లేకుండా జన్మించేలా చేస్తుంది. గర్భధారణ సమయంలో 3 నెలల తర్వాత ఎండుద్రాక్షను తినటం ప్రారంభించాలి. అలాగే రోజుకి 4 లేదా 5 ఎండుద్రాక్షలను మాత్రమే తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.