Healthhealth tips in telugu

కేవలం అర స్పూన్ పొడి అధిక బరువు,డయాబెటిస్ ఉన్నవారికి దివ్య ఔషధం…జీవితంలో అసలు ఉండవు

Triphala Churna health Benefits : త్రిఫల చూర్ణంనకు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పొడిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాదరణంగా మనలో చాలా మంది త్రిఫల చూర్ణంను వాడుతూ ఉంటారు. త్రిఫల చూర్ణం ఆయుర్వేదం షాప్ లో చాలా విరివిగా లభ్యం అవుతుంది. త్రిఫలలో అనేక ఔషధ ప్రయోజనాలున్నాయి.
Triphala Churnam Benefits In telugu
ఉసిరి,కరక్కాయ, తానికాయ ఈ మూడింటి పోడులను సరైన మోతాదులో కలిపి త్రిఫల చూర్ణంను తయారుచేస్తారు. త్రిఫలను నీటిలో కలిపి… కషాయంలాగా తాగొచ్చు. లేదంటే రాత్రి సమయంలో పాలు లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. త్రిఫలను ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
ఎంత మోతాదులో తీసుకోవాలో ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవాలి. సాధారణంగా రోజూ 2 నుంచీ 5 గ్రాములు తీసుకోవచ్చు.
Weight Loss tips in telugu
అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఉదయం సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడిని కలిపి తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు సమస్య నుండి బయట పడతారు. డయాబెటిస్ ఉన్నవారు త్రిఫల తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోదిస్తుంది. మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది గ్లూకోజ్‌గా మారి శక్తిని అందిస్తుంది.
Diabetes In Telugu
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను మొదట సాధారణ కార్బోహైడ్రేట్లుగా మార్చాలి,వాటిని గ్లూకోజ్‌గా మార్చడానికి ముందు ఈ మార్పిడికి అవసరమైన ఆల్ఫా అమైలేస్ అనే ఎంజైమ్ తప్పనిసరిగా కడుపులో ఉత్పత్తి అవుతుంది. ఇది సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లను గ్లూకోజ్‌గా మార్చడంలో సహాయపడుతుంది
త్రిఫల ఆల్ఫా అమైలేస్‌ను తగ్గిస్తుంది.

అందువల్ల, సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లను సాధారణ కార్బోహైడ్రేట్‌లుగా మార్చడం జరగదు,కాబట్టి కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మారటం జరగదు. ఆహారం గ్లూకోజ్‌గా మారలేదు కనుక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. త్రిఫల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.