గుడ్డులో ఈ పొడిని కలిపి జుట్టుకి రాస్తే జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తుగా పెరుగుతుంది

Egg Hair Fall Tips :ప్రతి ఒక్కరూ జుట్టు అందంగా నల్లగా ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు దాని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.అయినా సమస్య తగ్గదు. మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ వాడితే జుట్టు పొడిగా మారటం., జుట్టు రాలిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.
Hair Fall Tips In Telugu
ఇలా కాకుండా సహజ సిద్ధమైన పదార్థాలతో మన ఇంటిలోనే ఈ చిట్కాతో జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి గ్రీన్ టీ చాలా బాగా సహాయపడుతుంది. గుడ్డు తెల్ల సొనలో గ్రీన్ టీ పొడి వేసి బాగా కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. అరగంటయ్యాక గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. .
Green Tea Brain Health Benefits
అలాగే మరొక చిట్కా కూడా ఉంది. గ్రీన్ టీ పొడిలో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి గంట అయ్యాక గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ రెండు చిట్కాలు చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. మీకు వీలును బట్టి ఏ చిట్కా అయినా ఫాలో అవవచ్చు. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.

జుట్టు సమస్యలు వచ్చినప్పుడు చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. గ్రీన్ టీలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ఉత్తేజ పరచడంలో సహాయపడతాయి. జట్లు రాలడాన్ని కూడా నివారిస్తాయి. గ్రీన్ టీ లో ఉండే B విటమిన్ జుట్టును మృదువుగా మరియు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

కోడి గుడ్డులో బయోటిన్ మరియు బి-కాంప్లెక్స్ విటమిన్లు సమృద్దిగా ఉండుట వలన జుట్టును మూలాల నుండి బలోపేతం చేసి కొత్త జుట్టు పెరగటానికి సహాయపడుతుంది. నిమ్మరసం జుట్టు ఫాలీ సెల్స్ ను బలోపేతం చేయడం మాత్రమే కాదు, జుట్టును పొడవుగా మరియు స్ట్రాంగ్ గా పెరగడానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.