1 గ్లాసు వైరల్ జ్వరం తగ్గిన తర్వాత వచ్చే నీరసం,నిస్సత్తువ,అలసటను మాయం చేస్తుంది

Super powerful drink In fatigue : ఈ సీజన్లో వానల కారణంగా వైరల్ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. జ్వరం తగ్గిన తర్వాత వచ్చే నీరసం తగ్గాలంటే చాలా సమయం పడుతుంది. అలాగే నీరసం లేకుండా చురుకుగా పనులు చేసుకోవాలంటే ఒక డ్రింక్ తయారీ గురించి తెలుసుకుందాం. ఈ డ్రింక్ అలసట,నీరసం నిస్సత్తువ వంటి వాటిని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఈ డ్రింక్ తయారీ కోసం ముందుగా ఒక బౌల్ లో ఒక స్పూన్ చియా సీడ్స్ వేసి నీటిని పోసి ఒక గంట పాటు నానబెట్టాలి. ఒక స్పూన్ అవిసే గింజలను వేగించి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ వేగించిన అవిసే గింజలు, నానబెట్టిన చియా సీడ్స్, ఒక స్పూన్ కోకో పౌడర్, నాలుగు పిస్తా పప్పులు, గింజ తీసేసిన నాలుగు ఖర్జూరాలను ముక్కలుగా కట్ చేసి వేయాలి.
weight loss drink
ఆ తర్వాత పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, అరకప్పు అరటిపండు ముక్కలు, ఒక అవకాడో గుజ్జు, ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేసుకోవాలి.
ఈ డ్రింక్ గ్లాస్ లో పోసి బ్రేక్ ఫాస్ట్ సమయంలో వారం రోజులపాటు తీసుకుంటే నీరసం,నిస్సత్తువ అలసట అన్ని తొలగిపోయి చురుకుగా,హుషారుగా ఉంటారు.
banana benefits in telugu
అలాగే ఈ డ్రింక్ బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్న వారికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. జీవక్రియ రేటును పెంచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి కూడా వేయదు. శరీరంలో కొవ్వు కూడా చాలా వేగంగా కరుగుతుంది.
Cholesterol Reduced Fruits
కాబట్టి అధిక బరువు, నీరసం, అలసట, నిస్సత్తువ వంటి వాటిని తగ్గించే ఈ డ్రింక్ ని కాస్త ఓపికగా చేసుకొని తాగండి. కేవలం వారం రోజుల్లోనే మంచి ఫలితం కనపడుతుంది. ఈ డ్రింక్ లో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు నీరసం తగ్గించటానికి సహాయపడతాయి. కాబట్టి ఈ డ్రింక్ ని ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.