దాల్చిన చెక్క+వెల్లుల్లి ఇలా తీసుకుంటే నరాల బలహీనత ,డయాబెటిస్ అనేవి అసలు ఉండవు
Garlic And cinnamon Benefits In telugu : దాల్చిన చెక్క, వెల్లుల్లి రెండింటిలోను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ నియంత్రణలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు.
ఒక్కసారి వచ్చింది అంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉండటమే కాకుండా దాని కారణంగా ఎటువంటి సమస్యలు ఉండవు. డయాబెటిస్ నిర్వహణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. వెల్లుల్లి తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది.
అలాగే జీర్ణ ప్రక్రియ బాగా సాగటానికి సహాయపడుతుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల డయాబెటిస్ నియంత్రిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది.జీర్ణక్రియను మెరుగు పరచడం వల్ల రక్తంలో గ్లూకోజ్ సాధారణ స్థితికి వస్తుంది.నరాల బలహీనత కూడా తగ్గుతుంది.
నిమ్మకాయలో కూడా విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి కూడా డయాబెటిస్ నియంత్రణలో సహాయపడతాయి.
ఈ డ్రింక్ రక్తంలో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. దాంతో డయాబెటిస్ కారణంగా వచ్చే గుండె సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క, రెండు వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఒక గ్లాస్ లోకి వడకట్టాలి. దీనిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. ఏ సమయంలోనైనా తాగవచ్చు. అయితే తాగటానికి అరగంట ముందు కడుపు ఖాళీగా ఉండాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.