Healthhealth tips in telugu

ఎర్ర తోటకూర ఎప్పుడైనా తిన్నారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Red amaranth leaves Benefits In telugu : ఆకుకూరల్లో ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను కలిగిస్తాయి. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే తోటకూరను ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే ఎర్ర తోటకూర కూడా మనకు అందుబాటులో ఉంటుంది. తోటకూరతో పోలిస్తే ఎర్ర తోటకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

ఎర్ర తోటకూరలో విటమిన్ ఏ., విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, ఫైబర్, ఫాస్ఫరస్,ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు అన్ని సమృద్ధిగా ఉంటాయి. వారంలో రెండుసార్లు ఈ ఆకుకూరతో కూర., పప్పు వంటివి చేసుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

రక్త పోటును, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచి రక్త ప్రవాహం బాగా సాగేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. వారికి కూడా ఈ ఆకుకూర మంచి ఔషధం అని చెప్పవచ్చు.

ఈ ఆకుకూరలో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ ఆకు కూరలో కేలరీలు ,కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు అలాగే ప్రోటీన్., ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి కూడా వెయ్యదు..
Immunity foods
విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. విటమిన్ K సమృద్ధిగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే రక్తం గడ్డ కట్టడంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.
Joint pains in telugu
ఎముకల ద్రవ్యరాశిని బలోపేతం చేస్తుంది. అలాగే కాల్షియం కూడా సమృద్ధిగా ఉండటం వలన ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో జీవక్రియ రేటును పెంచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయటమే కాకుండా…ముడతలు. మొటిమలు వంటివి లేకుండా ముఖం అందంగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది
eye sight remedies
ఇందులో బీటా-కెరోటిన్, జియాక్సంతిన్ మరియు లుటీన్ ఉన్నాయి, వీటిలో ఫ్లేవనాయిడ్ పాలీఫెనోలిక్ యాంటీఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ నుండి ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే విటమిన్ A కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది. కాబట్టి వారంలో రెండు సార్లు తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.