Healthhealth tips in telugu

వారంలో 2 సార్లు నీరసం లేకుండా బలంగా,ఆరోగ్యంగా ఉండటానికి…ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి

Healthy breakfast recipes : ఈ రోజుల్లో సమస్యలు అనేవి చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఆ సమస్య తగ్గటానికి చాలా సమయం పడుతుంది. చాలా మంది నీరసం,అలసట,నిస్సత్తువ వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పే breakfast ని వారంలో రెండు సార్లు తింటే మంచి ప్రయోజనం కలుగుతుంది.
moong dal
ఈ breakfast డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. అలాగే బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న వారికి కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ breakfast లో బియ్యం వాడటం లేదు. ఒక బౌల్ లో అరకప్పు కందిపప్పు, పావుకప్పు పచ్చిశనగపప్పు, పావుకప్పు పెసరపప్పు వేసి నీటిని పోసి మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టాలి.
curry leaves hair falla
మరొక బౌల్ లో పావు కప్పు జొన్న రవ్వ వేసి నీటిని పోసి గంట సేపు నానబెట్టాలి. నానబెట్టిన పప్పులలో నీటిని తీసివేసి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

దీనిలో నానబెట్టిన జొన్న రవ్వను నీరు లేకుండా గట్టిగా పిండి వేయాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు, రెండు స్పూన్ల అల్లం ముక్కలు, ఒక స్పూన్ కొత్తిమీర తరుగు,ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు, నాలుగు స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, పావుస్పూన్ ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
Ginger benefits in telugu
ఆ తర్వాత సన్నగా కట్ చేసిన సోయ కూర ( Dill Leaves ) పావు కప్పు వేసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుడుములు మాదిరిగా చేసుకొని ఆవిరి మీద దాదాపుగా పది నిమిషాలు ఉడికించాలి. వీటిని ఉదయం Break Fast సమయంలో తీసుకుంటే రోజంతా ఉషారుగా ఉంటారు. వారంలో రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."