Healthhealth tips in telugu

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించే అద్భుతమైన గింజలు….అసలు నమ్మలేరు

Sabja Weight Loss Tips : మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరుసటి రోజు శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు అన్నీ తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు… ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు.

కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.

ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ ‘ఇ’ లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే సబ్జా డ్రింక్ ఎలా తయారుచేయాలో చూద్దాం. సబ్జా గింజలు చాలా తక్కువ ధరలో చాలా సులువుగా అందుబాటులో ఉంటాయి.
Honey benefits in telugu
సబ్జా గింజలను నీళ్ళల్లో వేసి ఐదారు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత దానిలో కొంచెం నిమ్మరసం కలుపుకొని త్రాగాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటె క్రమంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. రుచి కోసం తేనె కూడా కలపవచ్చు. తేనె కూడా బరువు తగ్గటంలో సహాయపడుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.