ఎర్ర బెండకాయలను ఎప్పుడైనా తిన్నారా… ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Red Ladies Fingers Benefits in telugu : మనం సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే బెండకాయలను కూరగా వండుకుంటారు. కానీ ఇప్పుడు ఎర్ర బెండకాయలు మార్కెట్లో కి వస్తున్నాయి. వీటికి ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఆకుపచ్చని బెండకాయలు కన్నా ఎర్ర బెండకాయలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.
Red Ladies Fingers Benefits in telugu
ఈ ఎర్ర బెండకాయలు చలి ఎక్కువగాఉన్న ప్రాంతాలలో పండుతాయి. ఈ బెండకాయలకు దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందంట. ఈ బెండకాయలో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఎర్ర బెండకాయలు కనిపిస్తే తప్పనిసరిగా తెచ్చుకోండి. అలా అని ఆకుపచ్చని బెండకాయలను మానేయాల్సిన అవసరం లేదు.
blood
ఒకసారి అవి తింటే మరొకసారి ఇవి తింటే సరిపోతుంది. రక్తహీనత సమస్యను తగ్గించటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇక పోషకాల విషయానికి వస్తే సాదారణ బెండకాయతో పోలిస్తే ఎక్కువగా పోషకాలు ఉంటాయి. ఎర్ర బెండకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలాసిన్ మరియు ఇతర బి విటమిన్లు,మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం,ఫైబర్ సమృద్దిగా ఉండికేలరీలు తక్కువగా ఉంటుంది.

ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో సోడియం చాలా తక్కువగా ఉండటం మరియు బహుళఅసంతృప్త కొవ్వు సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ సి,ఐరన్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
Diabetes diet in telugu
ప్రొటీన్‌లు ఉండటం వల్ల శరీరానికి అవసరమైన శక్తిని అందించి రోజంతా హుషారుగా పనులు చేసుకోవటానికి సహాయపడుతుంది. ఎర్ర బెండకాయను తీసుకోవడం వల్ల దానిలోని ఐరన్ కంటెంట్ మరియు ప్రొటీన్ కంటెంట్ శరీరంలో జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.