Healthhealth tips in telugu

గర్భధారణ సమయంలో కాకరకాయ తింటే ఏమి అవుతుందో తెలుసా…అసలు నమ్మలేరు

Bitter Gourd During Pregnancy in Telugu :కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినటానికి ఇష్టపడరు. చేదుగా ఉన్నప్పటికీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో రెండుసార్లు తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి గర్భధారణ సమయంలో కాకరకాయ తినవచ్చా అనే సందేహం ఉంటుంది.

ఎందుకంటే గర్భధారణ సమయంలో తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకరకాయ తింటే దానిలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. కాకరకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది.శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ దగ్గు, జలుబు, జ్వరం వంటివి రావు.
Bitter Gourd In Telugu
చాలా మంది కాకర కాయని తొక్కతీసి వండుకుంటారు. తొక్కతోపాటు తింటేనే ప్రయోజనాలు కలుగుతాయి. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. కాకరకాయలో ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన పుట్టబోయే బిడ్డలో నాడీ లోపాలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గర్భధారణ సమయంలో కొంతమందికి డయాబెటిస్ వస్తూ ఉంటుంది. డెలివరీ అయ్యాక డయాబెటిస్ ఉండదు.

ఇలా గర్భధారణ సమయంలో డయాబెటిస్ రాకుండా ఉండాలంటే కాకరకాయ తీసుకోవాలి. ఇలా కాకరకాయను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేసి డయాబెటిస్ రాకుండా చేస్తుంది. కాకరకాయలో సహజసిద్ధమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఈ చేదులో ఉండే చరాన్టిన్ ,పాలీప్టైడ్-పి వంటి కొన్ని పోషకాలు గర్భధారణ సమయంలో డయాబెటిస్ తో పోరాడటానికి సహాయపడతాయి.
gas troble home remedies
కాకరకాయ గర్భిణీ స్త్రీలలో పేగు కదలికలను ,జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని పోషకాలు శరీరం నుండి విషాన్ని తొలగించడానికి, పేగు పురుగులను తొలగించడానికి ,ఆకలిని తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి వారంలో రెండు సార్లు తినటానికి ప్రయత్నం చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.