చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను అందించే వీటి గురించి తెలిస్తే…అసలు నమ్మలేరు
Body health and strong Foods : ఈ మధ్యకాలంలో మనలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడానికి ఎంత ఖర్చు పెట్టటానికైనా సిద్ధంగా ఉంటున్నారు. అయితే మంచి పోషకాలు ఉన్న ఆహారం చాలా చవకగా మనకు సులభంగా అందుబాటులో ఉంటుంది. .
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పే ఆహారాలు అందరికీ అందుబాటులో ఉన్న ఎక్కువగా తినటానికి ఆసక్తి చూపరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. రోజంతా అలసట లేకుండా హుషారుగా పనులు చేసుకోవాలంటే మన శరీరానికి పోషకాలు చాలా అవసరం.
జొన్నలు మన పూర్వీకులు ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు మరల జొన్నల వాడకం పెరిగింది. జొన్నలలో శక్తి, కేలరీలు, ప్రోటీన్, రెసిస్టెంట్ స్టార్చ్, కరిగే మరియు కరగని ఫైబర్, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. జొన్నలతో అన్నం వండుకోవచ్చు…లేదంటే జొన్న రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు…లేదంటే జొన్న పిండితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు.
అరటిపండు సంవత్సరం పొడవునా అందరికీ అందుబాటు ధరలో లభ్యం అవుతుంది. కాస్త నీరసంగా ఉంటే ఒక అరటిపండు తింటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అరటిపండులో పొటాషియం, ఫైబర్, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, నియాసిన్, రిబోఫ్లావిన్ మరియు B6 వంటి పోషకాలు సమృద్దిగా ఉన్నాయి.
శనగలలో ప్రోటీన్ చాలా సమృద్దిగా ఉంటుంది. మాంసం తినలేని వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అలాగే శనగలను పేదవాని బాదం అని కూడా చెప్పుతారు. శనగలలో ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శనగలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.
పాలకూరలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆకుకూరలు చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. వారంలో రెండు సార్లు పాలకూరను ఆహారంలో బాగంగా చేసుకుంటే వాటిలో ఉన్న పోషకాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అలాగే గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పెసలలో ప్రొటీన్లు మరియు పీచుపదార్థాలు ఎక్కువగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది కండరాలను రిపేర్ చేయడంలో మరియు నిర్మించడంలో సహాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. శాకాహార ఆహారాన్ని ఇష్టపడే మరియు ప్రోటీన్ కొరత ఉన్నవారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.