ఈ గింజలు గురించి మీకు తెలుసా…ఊహించని లాభాలు ఎన్నో….అసలు నమ్మలేరు
chironji benefits in telugu : చిరోంజీని ఎక్కువగా స్వీట్స్ లో వాడతారు. అలాగే బాదంపప్పులకు ప్రత్యామ్నాయంగా వాడుతూ ఉంటారు. వీటిలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి బాదం పప్పు రుచిని కలిగి ఉంటాయి. వీటిని పచ్చిగా తినవచ్చు…లేదంటే వేగించి కూడా తినవచ్చు.
ఈ గింజలలో ప్రోటీన్,ఫైబర్ చాలా సమృద్దిగా ఉంటాయి. అలాగే విటమిన్ B1, B2 మరియు C, నియాసిన్, ఫాస్ఫరస్,ఐరన్ మరియు కాల్షియం వంటివి సమృద్దిగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి.
అందువల్ల నాసికా మరియు ఛాతీ రద్దీని తగ్గించడంలో సహాయపడి జలుబు మరియు దగ్గు నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. జీర్ణ సంబంద సమస్యలను తగ్గిస్తుంది. ఈ గింజల్లో సమృద్ధిగా ఉండే ఖనిజాలు మరియు విటమిన్లు చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ గింజల పొడిని పాలల్లో కలిపి ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా చేయటం వలన చర్మం మీద మృత కణాలు,మురికి తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. అందుకే ఈ గింజలను సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు. ఈ గింజలలో యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ బయోఫిల్మ్ లక్షణాలు ఉండుట వలన గాయం నయం చేసే లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందింది.
నోటి పూతల చికిత్సకు సహాయపడుతుంది. చిరోంజి జీర్ణ సమస్యలకు చికిత్స చేయడంతో పాటు శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుందని నమ్ముతారు. ఇది అల్సర్ల చికిత్సకు దోహదం చేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడి డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది. ఆవనూనెలో చిరోంజి గింజల పొడి కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పులు తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.