అధిక రక్తపోటు ఉన్నవారు సోంపు తింటే ఏమి అవుతుందో తెలుసా…?

Fennel Seeds Health benefits In telugu : సోంపులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలో చాలా మంది భోజనం అయ్యాక సోంపును నోట్లో వేసుకొని నములుతూ ఉంటారు. అలా చేయటం వలన తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుందని నమ్మకం. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.

వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి, వ్యాయామం చేయకపోవటం,ఒత్తిడి,ఎక్కువసేపు కూర్చొని ఉండటం,జంక్ foods ఎక్కువగా తినటం వంటి అనేక రకాల కారణాలతో రక్తపోటు సమస్య వస్తుంది. రక్తపోటు సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు.
sompu
రక్తపోటు సమస్య ఉన్నప్పుడు జీవితకాలం మందులు వాడాలి. అలా మందులను వాడుతూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సొంపు గింజలు రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. అరస్పూన్ సోంపు గింజలు నమిలితే.. లాలాజలంలో నైట్రెట్ల పరిమాణం పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచటానికి నేచురల్ రెమిడీ గా పనిచేస్తుంది.
sompu beenfits
అధిక రక్తపోటుతో బాధపడే వారు ప్రతి రోజూ సోంపు గింజలు నమిలితే మంచిది. సోంపులో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తప్రవాహంలో ద్రవం మొత్తాన్ని నియంత్రిస్తుంది. ఇది హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. సోంపు గింజలను నమలడం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన పొటాషియం స్థాయిలు ఉండేలా చేస్తుంది.
sompu
సోంపులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే సోంపులో ఉండే ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ కరిగిపోకుండా చేస్తుంది. తద్వారా కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సోంపును నమలటం ఇబ్బందిగా ఉంటే సోంపు టీ తయారుచేసుకొని తాగవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.