ఇలా తీసుకుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండదు
Herbs For Heart health In Telugu : మన శరీర ఆరోగ్యం మొత్తం గుండె మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. జీవనశైలిని మార్చుకోవాలి. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. తీసుకొనే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ లేకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను తెలుసుకుందాం.
తులసిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, ఇది కొవ్వులో కరిగే సూక్ష్మపోషకం, ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. తులసి ఆకులు మెదడు పనితీరుకు కూడా సహాయపడతాయి. తులసిలోని ముఖ్యమైన నూనెలు శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే మెగ్నీషియం కూడా సమృద్దిగా ఉండుట వలన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
అలాగే రక్త నాళాలు మరియు కండరాలను సడలిస్తుంది. అందువల్ల తులసి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా అద్భుతమైనది. ప్రతి రోజు 3 తులసి ఆకులను శుభ్రంగా కడిగి నమిలి తినవచ్చు…లేదంటే పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసు నీటిని పోసి 5 తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు.
ఆయుర్వేదం ప్రకారం అర్జున బెరడు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది. అర్జున బెరడులో ఉండే పోషకాలు గుండె కండరాలను బలోపేతం చేయడం ద్వారా గుండె యొక్క సరైన పనితీరులో సహాయపడుతుంది. అలాగే యాంటీ-హైపర్‌టెన్సివ్ లక్షణాలు ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. అర్జున బెరడు కషాయం చేసుకొని తాగవచ్చు.
ఉసిరిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది. అలాగే రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. సీజన్ లో ఉసిరి కాయలను తీసుకోవచ్చు. సీజన్ కానప్పుడు డ్రై ఉసిరి ముక్కలు లేదా పొడిని వాడవచ్చు.
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గుండెను రక్షించటంలో సహాయపడతాయి. రోజుకి రెండు వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో బాగంగా చేసుకుంటే శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి వెల్లుల్లిని క్రమం తప్పకుండ ప్రతి రోజు తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.
ఈ ఆహారాలను తీసుకుంటూ ప్రతి రోజు ఖచ్చితంగా అరగంట వ్యాయామం చేయాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రాణాయామం, ధ్యానం, సంగీతం వినడం వంటి మైండ్ రిలాక్సింగ్ యాక్టివిటీస్ రోజూ చేస్తూ ఉండాలి. మానసికంగాను కూడా చాలా ప్రశాంతత ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.