వాల్ నట్స్ ఈ సమస్యలు ఉన్నవారు తింటే ఏమి అవుతుందో తెలుసా ?

Walnuts Side Effects In Telugu : వాల్ నట్స్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వాల్ నట్స్ తినటం కూడా ఎక్కువ అయింది. అయితే వాల్ నట్స్ (Walnuts) ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
WalNuts Benefits In telugu
వాల్ నట్స్ ప్రతి రోజు తింటే అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. గుండె జబ్బులు,అధిక బరువు,డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. వాల్ నట్స్ ని ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. వాల్ నట్స్ తిన్నప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తే తినటం మానేయలి.
walnut benefits in telugu
వాల్ నట్స్ లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు వస్తాయి. వాల్ నట్స్ తిన్నప్పుడు ఛాతీ బిగుతుగా లేదా శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తే మాత్రం అసలు తినకూడదు. అది అలెర్జీ కావచ్చు. వాల్ నట్స్ యాంటీక్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, కార్డియో- మరియు న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి.
Wal Nuts Benefits In telugu
అయిన సరే అల్సర్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా లిమిట్ గా తింటే ఎటువంటి సమస్యలు రావు. ఏదైనా ఎక్కువగా తింటే అనర్ధమే కదా…అయితే రోజుకి ఎన్ని వాల్ నట్స్ తినాలో…అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. రోజుకి రెండు వాల్ నట్స్ నీటిలో నానబెట్టి 5 గంటల తర్వాత తొక్క తీసి తింటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.