Healthhealth tips in telugu

రోజు చిన్న ముక్క తింటే ఎన్నో ప్రయోజనాలు…ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉన్నవారు…

Jaggery Health Benefits In telugu : మనలో కొంతమంది బెల్లం అంటే ఇష్టపడతారు. మరి కొంతమంది పంచదార అంటే ఇష్టపడతారు. అయితే పంచదార కన్నా బెల్లం తినటమే మంచిది. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. బెల్లం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Jaggery Health Benefits in Telugu
పండుగల వేళ ఇంట్లో చేసే నైవేద్యాలు, పిండివంటల్లో ఎక్కువగా బెల్లాన్ని వాడటం తెలిసిందే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బెల్లం, వేయించిన వేరుశనగపప్పులను మేలైన చిరుతిండిగా పరిగణిస్తారు. బెల్లం పోషకాల గని అని పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు. బెల్లం శరీరానికి కావలసిన తక్షణ శక్తినిచ్చి అలసటను దూరం చేస్తుంది.
kidney problems
టీలో పంచదారకు బదులు చెంచా బెల్లం పొడి వాడటం వల్ల మధుమేహ బెడద ఉండదు. బెల్లంలోని పొటాషియం రక్తపోటు నివారణ, నియంత్రణకు దోహదం చేయటమే గాక మూత్రపిండాలలో రాళ్ళ సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేసి కంటి నిండా కునుకు పట్టటానికీ ఇందులోని పొటాషియం ఉపయోగపడుతుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
పిల్లల ఎదుగుదలకు, ఎముకలు బలంగా ఉండటానికీ బెల్లంలోని కాల్షియం సహాయపడుతుంది. ఇప్పటి రోజుల్లో నూటికి 40 మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత బాధితులు రోజూ చిన్న బెల్లం ముక్క తింటే తగినంత ఐరన్ అంది సమస్య దూరమవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే మీ డైట్‌లో బెల్లాన్ని చేర్చుకోండి.
Acidity home remedies
వయస్సుతో సంబందం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ బెల్లన్ని తినవచ్చు. అలాగే భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.