కిడ్నీ స్టోన్స్,కంటిచూపు,రక్తహీనత లాంటి ఎన్నో సమస్యలకి మందులా పనిచేసే ఎంతో రుచికరమైన కూర
Gurugaku benefits In Telugu : కంటి చూపు మెరుగుపరచటానికి, లివర్ ని శుభ్రపరచి రక్తం బాగా పట్టటానికి,ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించటానికి మరియు కిడ్నీలో రాళ్ళను కరిగించటానికి సహాయపడే గురుగాకు (Gurugu Aaku)గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ ఆకుకూర ఎక్కువగా పంట పొలాల్లో దొరుకుతుంది.
ఈ ఆకుకూరను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టి దానిలో రెండు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, సన్నగా తరిగిన గురుగాకు వేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి.
ఆ తర్వాత పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసి మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత నిమ్మకాయంత చింతపండును నానబెట్టి ఆ రసాన్ని పోయాలి. ఆ తర్వాత రెండు నిమిషాలు ఉడికించాలి. ఇక దీనిలో తాలింపు పెట్టాలి. తాలింపు కోసం పొయ్యి మీద పాన్ పెట్టి రెండు స్పూన్ల వేరుశనగ నూనె పోయాలి.
ఆ తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు,ఒక స్పూన్ పొట్టు మినపప్పు, అరస్పూన్ జీలకర్ర, 5 లేదా 6 వెల్లుల్లిని తొక్క తీసి కచ్చా పచ్చాగా దంచి వేయాలి. ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి వేగించి తయారుచేసుకున్న కూరలో కలపాలి.
ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కూర రెడీ అయ్యిపోయింది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి పోషకాలు ఉన్న కూరలను తినటం అలవాటుగా చేసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటాం. ఈ కూరను వారంలో రెండు సార్లు తింటే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.