ఈ పొడిని ఇలా తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా నీరసం,అలసట ఉండవు

Belly Fat Tips In telugu : మారిన జీవనశైలి, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం వంటి అనేక రకాల కారణాలతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువు సమస్యతో మనలో చాలామంది బాధపడుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు చాలా కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.
Flax seeds
అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా ఒక పొడిని తయారు చేసుకుని ప్రతిరోజు వాడితే 15 రోజుల్లోనే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక కప్పు అవిసె గింజలను డ్రై రోస్ట్ చేయాలి.
Diabetes patients eat almonds In Telugu
ఆ తర్వాత ఒక కప్పు బాదంపప్పును డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత అరకప్పు నువ్వులు., అరకప్పు ఎండు కొబ్బరి పొడి, రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసి డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో వేగించి పెట్టుకున్న బాదంపప్పు, అవిసె గింజలు, ఎండు కొబ్బరి పొడి, నువ్వులు, దాల్చిన చెక్క వేసి మెత్తని పొడిగా మిక్సీ చేయాలి. .

ఆ తర్వాత ఒక కప్పు తాటి బెల్లం పొడి వేసి మరోసారి మిక్సీ చేసుకోవాలి. ఈ పొడినీ ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా నెల రోజులు పాటు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు ఒక గ్లాసు పాలల్లో అర స్పూన్ పొడి కలిపి తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు తాగుతూ ఉంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడమే కాకుండా ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. .

అలాగే అలసట, నీరసం, నిసత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది.రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా ఈ పొడి చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఇటువంటి పొడి తయారుచేసుకొని వాడితే ఎన్నో సమస్యల నుండి బయట పడి ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.