Healthhealth tips in telugu

ఈ పాయసం తింటే మానసిక ఒత్తిడి, ఆందోళన టెన్షన్, నీరసం,అలసట అనేవి ఉండవు

Barley Benefits : ఈ రోజుల్లో సమస్యలు అంటే చాలా స్పీడ్ గా వచ్చేస్తున్నాయి. వాటిని తగ్గించుకోవటం చాలా కష్టం అయ్యిపోతుంది. వేసవిలో వచ్చే సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళ,న టెన్షన్, నీరసం వంటివి తగ్గటానికి ఈ రోజు బార్లీతో పాయసం తయారుచేసుకుందాం. ఈ పాయసం తయారుచేసుకోవటం చాలా సులువు. కాస్త ఓపిక ఉంటే చాలు.

అరకప్పు బార్లీని రాత్రి సమయంలో నీటిని పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పొయ్యి మీద గిన్నె పెట్టి లీటర్ పాలను పోసి కొంచెం వేడి అయ్యాక నానబెట్టిన బార్లీని వేయాలి. బార్లీని రఫ్ గా మిక్సీ కూడా చేయవచ్చు. ఈ బార్లీ ఉడకటానికి దాదాపుగా 15 నిమిషాల సమయం పడుతుంది.
cashew nuts Side effects in telugu
ఆ తర్వాత జీడిపప్పు,బాదం పప్పు,డేట్స్ లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా కలపాలి. ఒక నిమిషం అయ్యాక పొయ్యి ఆఫ్ చేయాలి. డేట్స్ చివరలో మాత్రమే వేయాలి, ఎందుకంటే పాలు విరిగే అవకాశం ఉంది. దీనిలో బెల్లం లేదా పంచదార వాడలేదు. ఖర్జూరం తీపి సరిపోతుంది.
Health Benefits of Dates
ఇలా తయారైన బార్లీ పాయసాన్ని బౌల్ లో సర్వ్ చేసి దాని మీద తేనె తో గార్నిష్ చేయాలి. అంటే ఎంతో రుచికరమైన బార్లీ పాయసం రెడీ. దీనిని వారంలో రెండు లేదా మూడు సార్లు తింటే ఎన్నో శారీరక,మానసిక సమస్యలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పాయసాన్ని తినవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.