బ్లాక్ సోయా బీన్స్ ఎప్పుడైనా తిన్నారా…ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు…
Black soyabeans Benefits in telugu : సోయాబీన్స్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనలో చాలా మందికి తెలుపు రంగులో ఉండే సోయాబీన్స్ మాత్రమే తెలుసు. సోయా బీన్స్ అనేవి నలుపు రంగులో కూడా ఇప్పుడు విరివిగా లభ్యమవుతున్నాయి. తెల్లని సోయా బీన్స్ తో పోలిస్తే నల్లని సోయాబీన్స్ లో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి.
బ్లాక్ సోయా బీన్స్ లో ఉండే ఇనుము, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, రాగి మరియు జింక్ అన్నీ ఎముకల నిర్మాణానికి మరియు ఎముకల నిర్వహణకు సహాయపడతాయి. ఎముకల నిర్మాణంలో కాల్షియం మరియు భాస్వరం ముఖ్యమైనవి, అయితే ఎముకలు మరియు కీళ్ల బలం మరియు స్థితిస్థాపకతను నిర్వహించడంలో ఇనుము మరియు జింక్ కీలకమైన పాత్రను పోషిస్తాయి.
రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. వీటిలో సహజంగా సోడియం తక్కువగా ఉండి పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నిర్వహణలో సహాయపడుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచి డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది.
వీటిలో ఫైబర్,పొటాషియం, ఫోలేట్, విటమిన్ B6, మరియు ఫైటోన్యూట్రియెంట్ సమృద్దిగా ఉండుట వలన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. విటమిన్ B6 మరియు ఫోలేట్ హోమోసిస్టీన్ అని పిలువబడే సమ్మేళనం ఏర్పడకుండా నిరోధిస్తుంది. హోమోసిస్టీన్ అధిక మొత్తంలో శరీరంలో పేరుకుపోయినప్పుడు…రక్త నాళాలను దెబ్బతీసి గుండె సమస్యలకు దారితీస్తుంది.
వీటిలోని ఫైబర్ జీర్ణ సంబంద సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్,కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. నల్ల సోయా బీన్స్ ని వారంలో రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.