వారంలో 2 సార్లు పచ్చి అరటిని తింటే ఊహించని ప్రయోజనాలు…ముఖ్యంగా ఆ సమస్యలు ఉన్నవారికి…
Raw Banana Benefits In Telugu : మూసేసి కుటుంబానికి చెందిన అరటిలో రెండు రకాలు ఉన్నాయి. కూర అరటి మరియు పండు అరటి. ఇప్పుడు మనం కూర అరటి గురించి వివరంగా తెలుసుకుందాం. కూర అరటిని పచ్చి అరటికాయ అని కూడా పిలుస్తారు. పూర్వం ప్రతి ఇంటిలోనూ అరటి చెట్టు ఉండేది.
అలాగే అరటి ఆకులో భోజనం చేసేవారు. పచ్చి అరటికాయను ఉడికించి లేదా ఫ్రై చేసి కానీ బజ్జిలుగా గాని,గ్రేవీలుగా మరియు కూరగా చేసు కుంటారు. కేరళలో పచ్చి అరటికాయతో చిప్స్ చేస్తారు. అక్కడ అవి బాగా ఫెమస్. ఆ అరటి చిప్స్ మనకు కూడా వచ్చేసాయి. పచ్చి అరటిని తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పచ్చి అరటికాయలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అరటికాయను రెగ్యులర్ గా తింటే జీర్ణక్రియ సాఫీగా జరిగి మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. రోజుకి 3.6గ్రాముల పచ్చి అరటికాయను తీసుకుంటే జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్ అందుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు పచ్చి అరటికాయ తింటే కడుపు నిండిన భావన కలిగి ఆహారం తక్కువ తీసుకుంటారు. తద్వారా బరువు తగ్గుతారు.
విటమిన్స్, మెగ్నీషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎముకలు బలంగా మారటమే కాకుండా కీళ్ల నొప్పులు రాకుండా కాపాడుతుంది. పచ్చి అరటికాయలో సుగర్ కంటెంట్ తక్కువగా ఉండుట వలన మధుమేహం ఉన్నవారు ఎటువంటి ఆలోచన లేకుండా నిరభ్యంతరంగా తినవచ్చు. మధుమేహం ఉన్నవారు ఉడికించి తీసుకుంటే మంచిది.
విటమిన్ బి6,సి సమృద్ధిగా ఉండుట వలన శరీర ఆరోగ్యాన్ని బాగా మైంటైన్ చేయటంలో సహాయ పడతాయి. పచ్చి అరటికాయను రెగ్యులర్ గా ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరానికి మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. మంచి బ్యాక్టీరియా ప్రేగుల్లో ఉంటుంది. ఇది తీసుకున్న ఆహారం బాగా తేలికగా జీర్ణం కావటానికి సహాయాపడుతుంది.
పచ్చి అరటి కాయలో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన నాడీ వ్యవస్థ చాలా చురుకుగా పనిచేస్తుంది. అలాగే మజిల్ మూవ్మెంట్స్ బాగా ఉండేలా చేస్తుంది. కిడ్నీలలో రక్తం ప్యూరిఫై చేయడానికి పొటాషియం చాలా అవసరం అవుతుంది. పచ్చిఅరటికాయలో ఉండే పిండి పదార్ధం శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేయటం మరియు రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.