ఆందోళన,మానసిక ఒత్తిడి, టెన్షన్, నీరసం,అలసటను తగ్గించే అద్భుతమైన పాయసం
Barley Benefits .In Telugu: ఈ రోజుల్లో సమస్యలు అంటే చాలా స్పీడ్ గా వచ్చేస్తున్నాయి. వాటిని తగ్గించుకోవటం చాలా కష్టం అయ్యిపోతుంది. వేసవిలో వచ్చే సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళ,న టెన్షన్, నీరసం వంటివి తగ్గటానికి ఈ రోజు బార్లీతో పాయసం తయారుచేసుకుందాం. ఈ పాయసం తయారుచేసుకోవటం చాలా సులువు. కాస్త ఓపిక ఉంటే చాలు.
అరకప్పు బార్లీని రాత్రి సమయంలో నీటిని పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పొయ్యి మీద గిన్నె పెట్టి లీటర్ పాలను పోసి కొంచెం వేడి అయ్యాక నానబెట్టిన బార్లీని వేయాలి. బార్లీని రఫ్ గా మిక్సీ కూడా చేయవచ్చు. ఈ బార్లీ ఉడకటానికి దాదాపుగా 15 నిమిషాల సమయం పడుతుంది.
ఆ తర్వాత జీడిపప్పు,బాదం పప్పు,డేట్స్ లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా కలపాలి. ఒక నిమిషం అయ్యాక పొయ్యి ఆఫ్ చేయాలి. డేట్స్ చివరలో మాత్రమే వేయాలి, ఎందుకంటే పాలు విరిగే అవకాశం ఉంది. దీనిలో బెల్లం లేదా పంచదార వాడలేదు. ఖర్జూరం తీపి సరిపోతుంది.
ఇలా తయారైన బార్లీ పాయసాన్ని బౌల్ లో సర్వ్ చేసి దాని మీద తేనె తో గార్నిష్ చేయాలి. అంటే ఎంతో రుచికరమైన బార్లీ పాయసం రెడీ. దీనిని వారంలో రెండు లేదా మూడు సార్లు తింటే ఎన్నో శారీరక,మానసిక సమస్యలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పాయసాన్ని తినవచ్చు.
ఏమైనా సమస్యలు ఉన్నప్పుడూ మనం ముందుగా ఇంటి చిట్కాలను ఫాలో అవవ్వచ్చు. ఈ విధంగా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. మన శరీరానికి అవసరమైన పోషకాలు అందితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.