Healthhealth tips in telugu

వామును ఎక్కువగా వాడుతున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు

Ajwain Side Effects in telugu : మనం ప్రతిరోజు వామును వాడుతూనే ఉంటాం. ఒక ప్రత్యేకమైన రుచిని కలిగిన వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మనకు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మన పూర్వీకుల కాలం నుండి వామును రెగ్యులర్ గా వాడుతున్నారు..

కాస్త కడుపులో gadabidaga ఉందంటే మన పెద్దవారు కొంచెం వాము, ఉప్పు కలిపి నమలమని చెబుతూ ఉంటారు. అయితే వామును ఎక్కువగా తీసుకోవడం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మనలో చాలామంది గ్యాస్., అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు వచ్చినప్పుడు వామును వాడుతూ ఉంటారు.
gas troble home remedies
అయితే వామును ఎక్కువగా తీసుకోవడం వలన గుండెల్లో మంట, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే వాములో వేడి చేసే గుణం ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు తలనొప్పి, అలసట, బలహీనత, డిహైడ్రేషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. .

అంతేకాకుండా గుండెపోటు వచ్చే రిస్కు కూడా ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా గర్భధారణ సమయంలో కూడా వామును పూర్తిగా మానేయటమే మంచిది. ఎందుకంటే వాము గర్భస్రావానికి కారణం కావచ్చు. కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు వామును అసలు తీసుకోకూడదు. ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే సమస్య తీవ్రం అవుతుంది.
Ajwain Health Benefits In Telugu
వాములో థైమోల్ మరియు గామా టెర్పెన్ వంటివి ఉండటం వలన వమును ఎక్కువగా తీసుకున్నప్పుడు తల తిరగడం మరియు వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అరస్పూన్ వాడటం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. కానీ అతిగా వాడటం వల్ల గుండెల్లో మంట వస్తుంది. కాబట్టి వామును లిమిట్ గా తీసుకొని ఆ ప్రయోజనాలు పొందండి. సమస్యలు ఉన్నవారు మాత్రం వాము తీసుకోవాలంటే డాక్టర్ ని సంప్రదించి తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.