Healthhealth tips in telugu

వారంలో 2 సార్లు ఈ జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలు…ముఖ్యంగా మహిళలకు

Women Healthy Juice In telugu : సాధారణంగా మహిళలు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాల పనులను చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ తరం మహిళలైతే ఒక పక్క ఆఫీస్ పనులు మరోపక్క ఇంటి పనులు చేసుకుంటూ ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. అందువలన మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు డైట్లో చేర్చుకోవాలి. .
Diabetes patients eat almonds In Telugu
అప్పుడే అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా హుషారుగా పనులను చేసుకుంటారు. ఇప్పుడు చెప్పే జ్యూస్ ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముందు లేదా తర్వాత అయినా తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. రాత్రి సమయంలో ఐదు బాదం పప్పులను నీటిలో వేసి నానబెట్టాలి మరుసటి రోజు ఉదయం నానిన బాదం పప్పులను తొక్క తీసి ఉంచుకోవాలి. .
beetroot juice
ఆ తర్వాత ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకుని తొక్క తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన బీట్రూట్ ముక్కలు, అరకప్పు కొబ్బరి ముక్కలు, తొక్క తీసిన బాదం పప్పులు, ఒక గ్లాసు నీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి పల్చని వస్త్రం సాయంతో జ్యూస్ ను సపరేట్ చేయాలి. ఈ జ్యూస్ ను వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకుంటూ ఉంటే మహిళలు ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ మధ్య కాలంలో మహిళలు అధిక బరువు, రక్తహీనత వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు.
Joint Pains
ఆ సమస్యలను తగ్గించడానికి ఈ జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది. అంతే కాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎముకలు బలంగా, దృఢంగా మారి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఆల్జీమర్స్ వంటి సమస్యలు ఏమీ లేకుండా జ్ఞాపకశక్తి కూడా బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.