ఈ ఆకు శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ చేసి రక్తనాళాల్లో బ్లాకేజ్ లేకుండా చేస్తుంది
Sweet Potato Benefits In telugu : తియ్యని రుచిలో ఉండే చిలకడ దుంప అంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే చిలకడ దుంప ఆకులలో కూడా ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనలో చాలా మందికి ఈ ప్రయోజనాల గురించి తెలియదు.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నాలుగు చిలకడ దుంప ఆకులను వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి…ఆ నీటిని వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ ఆకులలో T- కణాలు (T-లింఫోసైట్లు) మరియు సహజ కిల్లర్ కణాలు (NK-కణాలు) ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
ఈ ఆకులో యాంటీ-డయాబెటిక్ సమ్మేళనాలు ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఈ ఆకులో దాదాపుగా 24 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అందువల్ల రక్తంలో కొలెస్ట్రాల్ ని తొలగించి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ముఖ్యంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసి రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడకుండా కాపాడుతుంది. చిలకడ దుంప ఆకులలో విటమిన్ K సిరలు మరియు ధమనుల వెంట రక్త నాళాలను కప్పి ఉంచే కణాల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తం యొక్క రక్తం గడ్డకట్టే సామర్థ్యాలను సులభతరం చేస్తుంది.
లివర్ సేల్స్ డ్యామేజ్ కాకుండా లివర్ సేల్స్ ని కాపాడటానికి సహాయపడుతుంది. అలాగే ప్రేగు కదలికలు బాగా జరిగేలా చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఆందోళన మరియు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ ఆకులలో లుటీన్ మరియు జియాక్సంతిన్ సమృద్దిగా ఉండుట వలన కంటిశుక్లం మరియు వయస్సు పెరిగే కొద్ది వచ్చే మాక్యులార్ డీజెనరేషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కంటి కండరాలకు ఆక్సీకరణ నష్టం జరగకుండా చేస్తుంది. కాబట్టి చిలకడ దుంప ఆకులను తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.