Healthhealth tips in telugu

ఈ గింజలు తింటే కంటి సమస్యలు తగ్గటమే కాకుండా…మరెన్నో ప్రయోజనాలు

Annatto Seeds Benefits In Telugu : Annatto Seeds లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గింజలను ఎక్కువగా ఆహారానికి పసుపు లేదా నారింజ రంగు రావటానికి ఉపయోగిస్తారు. అలాగే రుచి మరియు వాసన కోసం కూడా ఉపయోగిస్తారు. ఈ గింజలలో ఉండే పోషకాల విషయానికి వస్తే…
annatto seeds benefits
ఈ గింజలలో అమైనో ఆమ్లాలు, కాల్షియం, ఇనుము మరియు భాస్వరం, అలాగే విటమిన్లు B-2 మరియు B-3 ఉన్నాయి. వాటిలో బీటా-కెరోటిన్ మరియు విటమిన్ సి వంటి రెండూ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కణాలు మరియు DNAకు ఫ్రీ-రాడికల్ కారణంగా కలిగే నష్టాన్ని నిరోదిస్తాయి.

వీటిలో అదనంగా ఫైటోకెమికల్స్ సైనిడిన్, ఎలాజిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, సపోనిన్లు మరియు టానిన్లు ఉంటాయి. ఫైటోకెమికల్స్ సహజంగా మొక్కలలో కనిపించే సమ్మేళనాలు, ఇవి మానవులలో వ్యాధిని నివారించడానికి మరియు చికిత్స చేయడానికి సహాయపడతాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

పొడి చర్మం, ముడతలను తగ్గించటమే కాకుండా వృదాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. అందువల్ల వీటిని చాలా కాస్మెటిక్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ గింజలలో కెరోటినాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన కంటి చూపు మెరుగుదలకు మరియు మాక్యులర్ డీజెనరేషన్ మరియు కంటిశుక్లంలను తగ్గిస్తుంది. కంటిశుక్లం పెరగకుండా చేస్తుంది.
eye sight remedies
ఈ గింజల పొడిలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంద సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ క్రియను వేగవంతం చేసి మలబద్దకం,గ్యాస్ వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అంతేకాక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మరియు మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా దోహదపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన గాయాలను నయం చేయడాన్ని వేగవంతం చేస్తాయి.
gas troble home remedies
ఆరోగ్యకరమైన కణాలు మరియు కణజాలాల ఉత్పత్తిని సులభతరం చేస్తాయి. ఇవి మచ్చలు మరియు చర్మ నష్టాన్ని తగ్గిస్తాయి. కాలిన గాయాలు లేదా చర్మంపై గాయాలు లేదా ఏదైనా చర్మ సమస్య నుండి నొప్పి ఉన్నప్పుడు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
Joint Pains
కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకల సాంద్రత బలాన్ని పెంచి ఎముకలు బలహీనంగా లేకుండా బలంగా ఉండేలా చేసి ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఈ గింజల పొడిని సలాడ్స్ మీద జల్లుకోవచ్చు…లేదంటే మొలకల మీద జల్లుకోవచ్చు. లేదంటే కూరల్లో కూడా కలుపుకోవచ్చు. ఇది నేచురల్ కలర్ ని ఇస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.