ఈ డ్రింక్ శరీరంలో వేడిని తగ్గించటమే కాక అధిక బరువు,శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది

Body heat reducing drink In Telugu : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పే డ్రింక్ 15 రోజుల పాటు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో వేడిని తగ్గించటమే కాకుండా అధిక బరువును, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఒక స్పూన్ సబ్జా గింజలను నీటిలో రెండు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో ఒక స్పూన్ సొంపు,3 స్పూన్ల బెల్లం,2 యాలకులు, 7 మిరియాలు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువ మొత్తంలో చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ చల్లని నీటిలో ఒక స్పూన్ పొడి, నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలను వేసి బాగా కలిపి తాగాలి.

రోజులో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. శరీరంలో వేడి తగ్గటమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. ఎండలోకి వెళ్ళి ఇంటిలోకి వచ్చిన వెంటనే ఒక గ్లాస్ డ్రింక్ తాగితే వడదెబ్బ,అలసట,నీరసం,తలనొప్పి వంటివి లేకుండా ప్రశాంతగా ఉంటారు. శరీరం రీఫ్రెష్ అవుతుంది.
sompu
ఇటువంటి పోషకాలు ఉన్న డ్రింక్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ డ్రింక్ చేసుకోవటం చాలా సులువు.కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ చలి కాలంలో వచ్చే అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

ఈ డ్రింక్ లో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు సులువుగా అందుబాటులో ఉంటాయి. అలాగే వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి. కాబట్టి కాస్త ఓపికగా ఇలాంటి డ్రింక్స్ తయారుచేసుకొని తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.