మంగమ్మగారి మనవడు సినిమా గురించి నమ్మలేని నిజాలు..నమ్మలేరు

mangammagari manavadu movie :నందమూరి నటవారసుడిగా నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ అందుకుని, కెరీర్ కి బలమైన పునాదులు వేసుకున్న మూవీ మంగమ్మగారి మనవడు. బాలయ్య,సుహాసిని జంటగా నటించిన ఈ సినిమాలో భానుమతి బామ్మగా చేసారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి తీసిన ఈ మూవీ అప్పట్లో ఓ సంచలనం.

ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కువ థియేటర్స్ లో ఈ మూవీ ఎక్కువ రోజులు ఆడింది. ఆ ఒక్క చోటే 50 లక్షలు వసూలుచేసి, అందరిని ఆశ్చర్యపరిచింది. తమిళంలో భారతీరాజా పల్లె తీసిన మన్ వాసిని మూవీ నిర్మాత గోపాల్ రెడ్డిని బాగా ఆకట్టుకుంది. అప్పటికే మనిషికో చరిత్ర, అపరాధి, ముక్కుపుడక వంటి మూవీస్ నిర్మించిన అనుభవంతో తమిళ మూవీ రైట్స్ తీసుకున్నారు.

కోడి రామకృష్ణను సంప్రదించి, డైరెక్ట్ చేయమని సూచించడంతో కొన్ని మార్పులు ఉండాలని చెప్పడం ,పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో గణేష్ పాత్రో తో కల్సి కథలో కీలక మార్పులు చేయించారు. బాలయ్య ఒకే చేసినా తండ్రి ఎన్టీఆర్ ఒకే చేయలేదు. రెండు సార్లు చేసిన ప్రయత్నం విఫలమవడంతో జననీ జన్మ భూమిశ్చ షూటింగ్ లో ఉన్న బాలయ్యను సంప్రదించడంతో తండ్రిని ఒప్పించారు.

నాయన్నమ్మ పాత్రకు భానుమతి కూడా ఒకే చెప్పేయడంతో టైటిల్ ఆమె పేరు కల్సి వచ్చేలా మంగమ్మగారి మనవడు అని పెట్టారు. అప్పటికే డిమాండ్ తగ్గిన కెవి మహదేవన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. డాక్టర్ సి నారాయణరెడ్డి, ఆరుద్ర పాటలు రాసారు. రెండు పాటలను భానుమతి స్వయంగా ఆలపించారు.

మద్రాసులో 1981 మే21న కపరంగం స్టూడియోలో షూటింగ్ స్టార్ చేసి, గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేసారు. 1984 సెప్టెంబర్ 7న భానుమతి పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేసారు. ఒక పాటలో రాముడుగా, కృష్ణుడుగా బాలయ్య కన్పించి కనువిందు చేసాడు. మహదేవన్ కంపోజ్ చేసిన దంచవే మేనత్త కూతురా, వంగతోట కాడా వంటి సాంగ్స్ అప్పట్లో సూపర్ హిట్. బాలయ్య, సుహాసిని జోడీకి జనం పట్టం కట్టారు.

గణేష్ పాత్రో మాటలు పేలాయి. గోకిన రామారావు, గొల్లపూడి మారుతీరావు, వై విజయ తమ పాత్రల్లో అదరగొట్టారు. 45కి పైగా ప్రింట్స్ తో విడుదలై, 6సెంటర్స్ డైరెక్ట్ మిగిలిన చోట్ల షిఫ్టింగ్ తో కల్సి 28సెంటర్స్ లో 100రోజులు ఆడింది. షిఫ్టింగ్ తో 565రోజులు ఆడడం ద్వారా రికార్డ్ క్రియేట్ చేసింది.

మూడున్నర కోట్లు వసూలు చేసి, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాన్ని ఆర్జించిపెట్టింది. మద్రాసులో జరిగిన 100రోజుల వేడుకలో బి నాగిరెడ్డి, కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ లుగా పాల్గొన్నారు. హైదరాబాద్ లో 365డేస్ వేడుక లక్షమంది ఫాన్స్ మధ్య జరిగింది. అక్కినేని, ఎన్టీఆర్, కె రాఘవేంద్రరావు, చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు.