దొంగోడోచ్చాడు సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు మీకోసం… మిస్ కాకుండా చూడండి

Super Star krishna dongodochadu telugu full movie :కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ప్రొడ్యూసర్ ఎన్. రామలింగేశ్వరరావు తీసిన సినిమా దొంగోడొచ్చాడు సూపర్ హిట్ అయింది. కృష్ణ అభిమాని అయిన రామలింగేశ్వరరావు ఎప్పుడు డేట్స్ అడిగినా కృష్ణ ఇచ్చేవారు. అలా ఇది మూడో సినిమా. ఇక రెమ్యునరేషన్ కూడా కృష్ణ డిమాండ్ చేసిన దాఖలాలు ఏ నిర్మాత దగ్గరా లేవు.

అయితే ముందు చిత్రం నిర్మాత ఎంతిచ్చారో తెలుసుకుని దానికి ఓ లక్ష కలిపి మరీ రామలింగేశ్వరరావు ఇచ్చేవారు. ఇక ఇండస్ట్రీ స్లంప్ లో ఉండడంతో సినిమాలు అన్నీ దెబ్బతింటున్న సమయంలో దొంగోడొచ్చాడు మూవీ హిట్ అవ్వడం పరిశ్రమకు ఊపునిచ్చింది. అప్పటికే కృష్ణతో ఓ సినిమా చేయడం వలన అతని ఇమేజ్ దృష్టిలో ఉంచుకుని వినోదభరితంగా ఈ మూవీని కోడి రామకృష్ణ తీర్చిదిద్దారు.

ఈ మూవీలో కృష్ణతో పాటు ఆయన సరసన నటించిన రాధ కూడా చిన్న సైజు దొంగ కావడంతో ఇద్దరి మధ్యా కొన్ని ఘటనలు బాగా ఆకట్టు కున్నాయి. అయితే హీరో హీరోయిన్స్ మధ్య ద్వంద్వార్థ సంభాషణలు శృతిమించయాన్ని విమర్శలు వచ్చాయి. ఇక అప్పటి వరకూ సీరియస్ విలనిజం చేసిన గిరిబాబు ఈ మూవీతో పూర్తిస్థాయి కమెడియన్ అయ్యారు.

గిరిబాబు తండ్రిగా గొల్లపూడి మారుతీరావు నటించి, ఒరే జనకా, ఒరే కొడకా అనే సంభాషణలు బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హిట్ అయ్యాక గిరిబాబు ఒకసారి తారసపడగా, ఈ మూవీ విజయంలో మేజర్ షేర్ నీదే అంటూ కృష్ణ తన మంచితనాన్ని చాటుకున్నారు. కథా చర్చలు అన్నీ పూర్తయ్యాక ఇలాగే తీయమని, చేర్పులు మార్పులు వద్దని చెప్పే గట్స్ ఉన్న నిర్మాతగా రామలింగేశ్వరరావు కి పేరుంది.

1987 ఫిబ్రవరిలో రిలీజైన ఈ మూవీ కనీవినీ ఎరుగని వసూళ్లు సాధించింది. ఇంటర్వెల్ ముందు సెంటిమెంట్ సీన్ ఉండాలని పట్టుబట్టి, అందరి చేత మెప్పు పొంది మరీ ఈ సినిమాలో నిర్మాత తన పట్టు నిరూపించుకున్నారు.