MoviesTollywood news in telugu

ఘరానా మొగుడు సాధించిన రికార్డులెన్నో తెలుసా…ఎన్ని కోట్ల లాభం…?

Gharana mogudu movie In Telugu : దర్శకేంద్రుని డైరెక్షన్ లో వచ్చిన ఘరానా మొగుడు సినిమాలో బంగారు కోడిపెట్ట సాంగ్ కి చిరంజీవి వేసిన స్టెప్పులకు 1990ల్లో బాక్సులు బద్ధలైపోయాయి. థియేటర్స్ అన్నీ అభిమానుల విజిల్స్‌తో మారుమోగిపోయాయి. బాక్సాఫీస్ రికార్డులతో షేక్ అయిపోయింది.

ఇంకా చెప్పాలంటే,బాక్సాఫీస్‌కు మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడులా మారిపోయాడు. ఇక పదేళ్ల కింద తన సినిమా కోసం బంగారు కోడిపెట్ట పాటను రామ్ చరణ్ రీమిక్స్ చేసాడు. ఈ సినిమా విడుదలై నిన్నటికి సరిగ్గా 28 ఏళ్లు గడిచిపోయింది. 1992, ఎప్రిల్ 9న ఘరానా మొగుడు విడుదలైంది.

అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులన్నింటినీ ఘరానా మొగుడు తుడిచేసింది. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. సైకిల్ ఎక్కి..’ ఫేస్ కాస్త రైట్ టర్నింగ్ ఇచ్చుకో.. చిన్న మెదడు చిట్లిపోయినట్లుంది..’ అంటూ పక్కా మాస్ డైలాగులతో చిరు చేసిన మ్యాజిక్‌ తో అప్పటి వరకు బాక్సాఫీస్ చూడని రికార్డులను చూపించాడు .

ఈ సినిమా తెలుగులో తొలి 10 కోట్ల షేర్ తీసుకొచ్చిన సినిమా గా నిల్చింది. ఈ రోజుకి ఘరానా మొగుడు సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా కోసం అప్పట్లోనే కోటి రూపాయలు పారితోషికం అందుకుని ఇండియన్ సినిమాలో సంచలనం సృష్టించాడు మెగాస్టార్. ఘరానా మొగుడు పాటలు బంపర్ హిట్. పండు పండు.. వాన పాట.. బంగారు కోడిపెట్ట ఇలా ఒక్కటేంటి సినిమాలో ఉన్న అన్ని పాటలు సూపర్భ్.

రాఘవేంద్రరావు టేకింగ్.. చిరంజీవి మెగా ఇమేజ్.. కామెడీ టైమింగ్.. నగ్మా అందాలు.. వాణి విశ్వనాథ్ సొగసులు అన్నీ సినిమాకు స్టార్ డమ్ తెచ్చాయి. కీరవాణి ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడు మరి. రావు గోపాల్ రావు, కైకాల సత్యనారాణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఘరానా మొగుడు మూడు దశాబ్దాలకు చేరుతున్నా సరే, ఇప్పటికీ అదే క్రేజ్.. అదే మోజు..