చిరంజీవి, బాలక్రిష్ణ పోటీ గురుంచి మీకు తెలీని ఆసక్తికరమైన విషయాలు

హీరోల మధ్య పోటీ,ఒకేసారి వారి సినిమాలు విడుదలవ్వడం,దీంతో పోటీ తారాస్థాయికి చేరడం మామూలే. అయితే మెగాస్టార్ చిరంజీవి,నందమూరి బాలకృష్ణ ల నడుమ పోటీ ఆసక్తికరంగా ఉండేది. ఒకేరోజు ఇద్దరి సినిమాలు విడుదలైంది ఒకే ఒక్కసారి కాగా, ఒక్కరోజు డ్రాప్ తో మూడు మూవీస్ రిలీజయ్యాయి. మిగిలిన మూవీస్ వారం,రెండు వారాల తేడాతో వచ్చాయి. 1983మార్చి3న ఎన్టీఆర్ ,బాలయ్య కల్సి చేసిన సింహం నవ్వింది మూవీ, మార్చి 11న అభిలాష విడుదలైంది. ఈ విధంగా వీరి మధ్య తొలిపోటీ చోటుచేసుకుంది.

అందులో అభిలాష సూపర్ హిట్ అయింది. ఇక 1989లో చిరు నటించిన అత్తకు యముడు,అమ్మాయికి మొగుడు మూవీని బాలయ్య నటించిన ముద్దుల కృష్ణయ్య బ్రేక్ చేయడంతో ఇద్దరి మధ్య పోటీపై అందరికి ఆసక్తి మరింత పెరిగింది. 1999లో స్నేహంకోసం,సమరసింహా రెడ్డి మూవీస్ తో పోటీ తారాస్థాయికి చేరింది.

ఇక 2001లో ఇద్దరి సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో ఫాన్స్ నడుమ ఫిజికల్ వార్ స్టార్ట్ అవ్వడమే కాదు, కులాల ప్రస్తావన దాకా వెళ్ళిపోయింది. 1984లో జననీ జన్మభూమిశ్చ రిలీజ్ కాగా, కొన్నాళ్ల తేడాతో వచ్చిన చిరు మూవీ ఛాలెంజ్ హిట్ అయింది. అయితే అదే ఏడాది వచ్చిన బాలయ్య మూవీ మంగమ్మగారి మనవడు సెన్షేషనల్ హిట్ కొట్టింది. దీంతో బాలయ్య ఇండస్ట్రీలో టాప్ హీరోలో ఒకడయ్యాడు.

ఇక వారం గ్యాప్ లో వచ్చిన చిరంజీవి ఇంటిగుట్టు కూడా హిట్ జాబితాలో చేరింది.1984లోనే చిరు నటించిన అగ్నిగుండం వచ్చి ప్లాప్ అవ్వగా, ఎన్టీఆర్,బాలయ్య కల్సి చేసిన వీరబ్రహ్మం గారి చరిత్ర మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ క్రెడిట్ ఎన్టీఆర్ కి దక్కుతుంది. ఇక అదే ఏడాది వచ్చిన బాలయ్య కధానాయకుడు మూవీ కూడా హిట్ అయింది. అయితే చిరంజీవి రుస్తుం మూవీ ప్లాప్ అవ్వగా, 1985లో వచ్చిన చట్టంతో పోరాటం మూవీ సూపర్ హిట్ కొట్టింది.

అదే ఏడాది బాలయ్య సినిమా ఆత్మబలం ప్లాప్ అయింది. అదే ఏడాది చిరంజీవి దొంగ సినిమా హిట్ అవ్వగా, బాలయ్య భార్యాభర్తల బంధం ఏవరేజ్ గా నిల్చింది. అయితే చిరు నటించిన చిరంజీవి ప్లాప్ కాగా, బాలయ్య భలేతమ్ముడు హిట్ అయింది. అయితే అదే ఏడాది బాలయ్య కత్తులకొండయ్య ప్లాప్ కాగా, చిరంజీవి మూవీ విజేత హిట్ కొట్టింది. 1986లో చిరు కొండవీటి దొంగ హిట్ కొత్తగా వారం గ్యాప్ లో వచ్చిన బాలయ్య నిప్పులాంటి మనిషి ఏవరేజ్ అయింది.

అదే ఏడాది బాలయ్య ముద్దుల కృష్ణయ్య హిట్ అవ్వగా, కొన్ని రోజుల గ్యాప్ లో వచ్చిన చిరు మగధీరుడు ప్లాప్ అయింది. అయితే బాలయ్య మూవీ కలియుగ కృష్ణుడు,చిరు రాక్షసుడు మూవీ హిట్ అయ్యాయి. ఇలా దాదాపు 30సినిమాలు ఒకరికి ఒకరు పోటీగా విడులయ్యాయి. ఇందులో చిరుకి 18హిట్స్ ఉంటె,బాలయ్యకు 14హిట్స్ ఉన్నాయి. చిరంజీవికి 4ఇండస్ట్రీ హిట్స్ ఉంటే,ఎన్టీఆర్ తో కలిపి ఉన్న ఒక హిట్ తో కలిపి బాలయ్యకు మూడు హిట్స్ ఉన్నాయి.