MoviesTollywood news in telugu

మరో చరిత్ర సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Maro charitra Movie :దాదాపు 42ఏళ్ళక్రితం బ్లాక్ అండ్ వైట్ లో కె బాలచందర్ సృష్టించిన విషాద ప్రేమకావ్యం మరోచరిత్ర మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్. ఈ సినిమా చూసి చాలామంది పిరికి ప్రేమికులు అప్పట్లో ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలు కూడా సాగాయి. కమల్ హాసన్, సరిత, మాధవి, నటన బాలచందర్ దర్శక ప్రతిభ, ఎం ఎస్ విశ్వనాథన్ మ్యూజిక్ వెరసి ఓ అపూర్వ విజయాన్ని అందించిన చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో నిల్చింది.

విశాఖ , భీమిలి అందాలను తెరకెక్కించిన తీరు అపూర్వం. పైగా బడ్జెట్ తక్కువ. కథాబలం, సాంకేతిక నిపుణులు,నటీనటులు, దర్శకుడు , మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాకు కలిసొచ్చాయి. అంతులేని కథ తర్వాత నేరుగా తెలుగులో సినిమా చేయాలన్న ఉద్దేశ్యంతో గణేష్ పాత్రోకి ఓ కథ వినిపిస్తే బాగుందని, టైటిల్ మరోప్రేమ చరిత్ర పెట్టాలని అనుకున్నారు. కానీ ఆడియన్స్ కి సస్పెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రేమ తొలగించి మరోచరిత్ర అని పెట్టారు.

హీరోగా కమల్ ని ఎంచుకున్నారు. అప్పటికే దాసరికి కమిట్ అవ్వడంతో విషయం చెప్పేసరికి ఆయన ఒకే చెప్పడంతో కమల్ మరోచరిత్ర చేయడానికి వీలయింది. హీరోయిన్స్ గా ఎంపికలో ఒక హీరోయిన్ గా మాధవిని ఎంపిక చేసారు. కీలక నాయికకు జయప్రదని అడిగితె కుదరలేదు. దీపకు ఖాళీలేదు. దీంతో తాతినేని చలపతిరావు చుట్టాలమ్మాయి అభిలాషను ఒక షూటింగ్ లో చూసిన గణేష్ పాత్రో విషయాన్ని బాలచందర్ కి చెప్పారు.

అభిలాషను పిలిచి, సాంగ్ పాడమంటే పాడేసింది. స్విమ్ సూట్ వేసుకోమంటే వేసేసుకుంది. దీంతో ఆమెను హీరోయిన్ గా ప్రకటిస్తూ అభిలాష పేరును కాస్తా సరితగా మార్చారు. విశాఖ అప్సర హోటల్ విడిది. ఎందుకంటే భీమునిపట్నం , గంగవరం వెళ్లాలంటే 2,3గంటలు పెట్టేస్తుంది. తెల్లవారుఝామున లేచి రెడీ అయ్యాక టిఫన్స్ చేయడానికి వీలుగా తమిళనాడు నుంచి వంటవాళ్లను తీసుకొచ్చారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సీన్స్ ప్రతిరోజూ తీసేవారు.

ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా తీసిన మరోచరిత్ర 1978మే 19న రిలీజైన మరోచరిత్ర నిజంగానే మరోచరిత్ర సృష్టించింది. ఆత్రేయ రాసిన ఆరు పాటలు, దానికి ఎం ఎస్ విశ్వనాథన్ కట్టిన బాణీలు అప్పట్లో కుర్రకారుని బట్టీపట్టించాయి. భలే భలే మాగాడివోయ్ బంగారు నాసామి సాంగ్ లో వచ్చే ఇంగ్లీషు మాటలు కొత్తగా అనిపించాయి.

లోక్ నాధ్ ఛాయాగ్రహణం అదిరింది. ప్రేమకథా చిత్రాల్లో విప్లవాత్మక మార్పు తెచ్చింది ఈ చిత్రం. ఏడాదిపాటు ప్రేమికులు విడిగా ఉండాలన్న పెద్దల నిబంధన, ఏడాది పూర్తయ్యేసరికి ట్రాజెడీగా ముగియడం వద్దని ఎంతవారించినా బాల చందర్ వినకుండా అనుకున్నది అనుకున్నట్టు తీశారు. చివరకు అదే హిట్ అయ్యేలా చేసింది.

షేక్ స్పియర్ ఆంగ్ల నాటకం రోమియో జూలియట్ ప్రేరణతో తీసిన ఈ మూవీ లో అందులోని డైలాగులు యధాతధంగా వాడేశారు. మద్రాసులో ఏకధాటిగా 512రోజలు ఆడి ,12లక్షలు కలెక్ట్ చేసింది. అడవిరాముడు తర్వాత సింగిల్ థియేటర్ లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన మూవీ ఇదే. దీన్నే ఎల్విప్రసాద్ హిందీలో బాలచందర్ డైరెక్షన్ లోఏక్ దూజే కేలియే మూవీగా తీస్తే, బాలు తొలిసారి పాడారు.

తెరేమేరె బీచ్ మే సాంగ్ కి జాతీయ అవార్డు వచ్చింది. అయితే ఈ సినిమాలో ప్రేమ జంట మరణం చూసి, దాదాపు 20ప్రేమ జంటలు సూసైడ్ లెటర్స్ రాసి ఆత్మహత్య చేసుకోవడంతో మానవ హక్కుల, అభ్యుదయ సంఘాలు విమర్శలు గుప్పించడంతో బాలచందర్ వివరణ ఇస్తూ జీవితంలో ఈ సినిమా తీయడం తాను చేరిన పెద్ద పొరపాటని వివరణ ఇచ్చుకున్నారు.