వీటిని తింటే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత అనేది అసలు ఉండదు
Anemia home remedies in ayurveda In Telugu : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధ పడుతున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు రక్తహీనత సమస్యకు దారితీస్తుంది. హిమోగ్లోబిన్ తయారవ్వాలంటే ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఇప్పుడు ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు గురించి తెలుసుకుందాం. .
ఇప్పుడు విరివిగా లభించే పుచ్చకాయను తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే పుచ్చకాయలో ఐరన్, విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి. దానిమ్మలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన మన శరీరం ఐరన్ ని బాగా గ్రహించటానికి సహాయపడుతుంది. దానిమ్మను గింజల రూపంలోను లేదా జ్యూస్ రూపంలోను తీసుకోవచ్చు.
ఖర్జూరాలలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన ప్రతి రోజు రెండు ఖర్జూరలను తింటే సరిపోతుంది. ఆప్రికాట్ లలో ఐరన్, విటమిన్ సి, ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన ప్రతి రోజు ఒక అప్రికాట్ తింటే చాలు. ఎండు ద్రాక్షలో కూడా ఐరన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రోజుకి 6 ఎండుద్రాక్షను నేరుగా లేదా నానబెట్టి తినవచ్చు.
ఎండబెట్టిన టమాటాలలో ఐరన్, విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. మనం తిన్న ఆహార పదార్థాల నుండి ఐరన్‌ను మన శరీరం సంగ్రహించడంలో విటమిన్ సి చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఎండబెట్టిన టమాటాలు మనకు మార్కెట్లో లభిస్తాయి. వీటిని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.
రక్తహీనత సమస్య ఉన్నప్పుడు అసలు అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ అశ్రద్ధ చేస్తే అది ఎన్నో రకాలుగా సమస్యలను తెచ్చి పెడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.