ఆకుపచ్చ శనగలను ఎప్పుడైనా తిన్నారా… ఊహించని ప్రయోజనాలు ఎన్నో… అసలు నమ్మలేరు
Green chickpeas benefits in Telugu : ఆకుపచ్చ శనగలు కూడా ఈ మధ్య కాలంలో చాలా విరివిగానే లభిస్తున్నాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. అరకప్పు ఆకుపచ్చని శనగలలో దాదాపుగా 364 కేలరీలు, 19.3 గ్రాముల ప్రొటీన్లు, 17.6 గ్రాముల డైటరీ ఫైబర్, 6 గ్రాముల కొవ్వు మరియు 10 గ్రాముల సహజ చక్కెర ఉంటాయి.
ఆకుపచ్చ శనగలను ప్రతి రోజు ఒక స్పూన్ తీసుకోవచ్చు… లేదంటే వారంలో మూడు సార్లు తీసుకోవచ్చు. వీటిని ఉడికించి… లేదంటే నానబెట్టి తీసుకోవచ్చు. ఆకుపచ్చని శనగలలో విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది.
విటమిన్ బి9, ఫోలేట్ సమృద్దిగా ఉండుట వలన ఒత్తిడి లేకుండా చేయటమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా చేస్తుంది. శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఆకుపచ్చని శనగలలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించటమే కాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి లేకుండా చేస్తుంది. బరువు తగ్గాలని అనుకొనే వారికీ మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.
అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉండటం వల్ల బరువు నిర్వహణలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది. కాబట్టి మంచి పోషక విలువలు ఉన్న ఆకుపచ్చని శనగలను తినటానికి ప్రయత్నం చేయండి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.