MoviesTollywood news in telugu

నాగార్జున, బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా ఆగిపోవటానికి కారణం…!?

Nagarjuna And Bala Krishna Movie: తమ అభిమాన హీరోలు ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే అభిమానులకు పండగే. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండుకళ్ళుగా భావించే నటరత్న ఎన్టీఆర్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కల్సి నటించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. వీరిద్దరి మధ్యా పోటీ కూడా ఎక్కువగానే ఉండేది. అయితే ఈ పోటీ వలన ఇండస్ట్రీకి లాభమే జరిగిందని అంటారు.

అయితే ఇద్దరూ 14మూవీస్ కల్సి నటించినా ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనే మాట రాలేదు. అయితే నటరత్న వారసుడిగా బాలయ్య, నటసమ్రాట్ వారసుడిగా నాగార్జున ఎంట్రీ ఇచ్చినా ఇద్దరూ కల్సి నటించలేదు. నాగ్, బాలయ్య కల్సి నటించాలని ఫాన్స్ చాలా ఎదురుచూసారు. ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. బాలయ్య,అక్కినేని కల్సి నటించారు.

అక్కినేనిని బాబయ్య అని బాలయ్య పిలిచేవారు. భార్యాభర్తలు, గాండీవం మూవీస్ ఇద్దరూ కల్సి నటించారు. అలాగే నాగ్ కి కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే గౌరవం. అందుకే నందమూరి హరికృష్ణతో కల్సి సీతారామరాజు మూవీలో కల్సి నటించారు. ఇక బాలయ్య,నాగ్ లతో కల్సి గుండమ్మ కథ మూవీ చేయాలన్న భావన వచ్చింది.
కానీ వర్కవుట్ కాలేదు.ఒకరికొకరు కల్సి నటించాలన్న కోరికను బహిరంగంగా ప్రకటించారు.

2011లో ఓ సినిమా కూడా ప్లాన్ చేసారు. మలయాళంలో సురేష్ గోపి, మోహన్ లాల్ తదితరులు కల్సి నటించిన క్రిస్టియన్ బ్రదర్స్ మూవీ తెలుగు రైట్స్ బెల్లంకొండ సురేష్ కొన్నారు. బాలయ్య,నాగ్ లతో కల్సి చేయాలనుకున్నారు. ఇద్దరూ ఒప్పుకున్నారు. మళ్ళీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. తర్వాత హరహర మహాదేవ మూవీని బెల్లంకొండ బి గోపాల్ డైరెక్షన్ లో చేయాలని భావిస్తే,అది కూడా వెనక్కి వెళ్ళింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."