పరగడుపున ఈ పొడిలో తేనె కలిపి తీసుకుంటే జీవితంలో డాక్టర్ అవసరం ఉండదు
Honey and Dalchina chekka Benefits In telugu : సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలు తగ్గాలంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఒక స్పూన్ దాల్చినచెక్క పొడిలో రెండు స్పూన్ల తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం అర స్పూన్ మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దాల్చిన చెక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అలాగే తేనెలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఈ కాంబినేషన్ ని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. వాపులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేదెలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచి చేస్తుంది. అధిక బరువు సమస్య ఉన్నవారు ప్రతి రోజూ తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.
ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ కి మంచి మందు అని చెప్పవచ్చు. మెదడుకు రక్షణ కల్పిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఫ్రీ రాడికల్స్ ని శరీరంలో సర్క్యులేట్ కాకుండా కాపాడతాయి. సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి వాటిని తగ్గిస్తుంది.
దగ్గు వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. కానీ ఈ మిశ్రమం తీసుకుంటే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ మిశ్రమంలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన దంత సమస్యలు చిగుళ్ల వ్యాధులు నోటిలో పుండ్లు వంటివి రాకుండా ఉండటమే కాకుండా నోటి దుర్వాసన కూడా లేకుండా చేస్తుంది.
రక్తప్రసరణ బాగా జరిగేలా చేయటమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
దాంతో గుండెకు సంబందించిన సమస్యలు ఏమి ఉండవు. అలాగే డయబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు రాకుండా చేస్తుంది. నరాల బలహీనత సమస్యను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాల్చినచెక్క పొడి మార్కెట్ లో దొరుకుతుంది. కానీ అది వాడకూడదు. మనం దాల్చినచెక్కను వెగించి పొడి తయారుచేసుకొని వాడితే మంచిది.
బయట మార్కెట్ లో దొరికే పొడి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి పొడి తయారుచేసుకుంటే చాలా రోజుల వరకు వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవటం కుదరని వారు అరగంట కడుపు ఖాళీగా ఉంచి ఆ తర్వాత తీసుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మిశ్రమాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.