Chiranjeevi బాబాయ్ మన తెలుగు సీరియల్స్ లో పెద్ద విలన్…ఎవరో తెలుసా?
Chiranjeevi Family: మెగాస్టార్ చిరంజీవికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది నటులు వచ్చారు. ఇంచుమించుగా వారందరు మనకు తెలిసిన వారే. అయితే ఇప్పుడు చెప్పబోయే నటుడు గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ఈయన తెలుగు సీరియల్స్ లో విలన్. విలన్ గా బాగా పేరు సంపాదించారు.
అడపా దడపా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసిన సీరియల్స్ తోనే బాగా ఫెమస్ అయ్యారు. అయన పేరు హరి. ఈయన మెగాస్టార్ కి వరుసకు బాబాయ్ అవుతాడు. హరి వయస్సులో చిరంజీవి కన్నా చిన్న అయినా వరుసకు చిరుకు బాబాయి అవుతారు.
హరి నెల్లూరు లో టీచర్ ఉద్యోగం చేసేవారు. చిరు ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చారు. అయితే ఈ పరిశ్రమలో సెటిల్ అవటానికి చాలా సమయమే పట్టింది హరికి. హరి సినిమాల్లోకి రావాలని అనుకోగానే చిరు దగ్గరకు వెళ్లి అడిగితే నా వంతు సాయాన్ని చేస్తా నీ ప్రయత్నం మాత్రం ఉండాలని ,అలాగే నన్ను మాత్రమే నమ్ముకొని ఈ రంగానికి రావద్దని చెప్పారట చిరు.
ఎందుకంటే సినీ రంగంలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలాగే హరి సినిమాల్లోకి వచ్చాక చిరు చిన్న చిన్న వేషాలను ఇప్పించారు. హీరోకి ఫ్రెండ్ గా విలన్ గ్యాంగ లో చిన్న రోల్స్ ఆలా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు హరి. 80 లో వచ్చిన చాలా సినిమాల్లో విలన్ గా చేసారు. అయితే ఆ సినిమాలు పెద్దగా హిట్ కాకపోవటంతో సినిమాల్లో సక్సెస్ కాలేదు.
దాంతో హరి తన దృష్టిని టీవీ సీరియల్స్ వైపు పెట్టారు. సీరియల్స్ లో విలన్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు రావటంతో మరల రాఖి,సింహాద్రి,ధోని,మగధీర వంటి సినిమాలలో గుర్తింపు ఉన్న రోల్స్ వచ్చాయి. నాగబాబు తాను నటించే ప్రతి సీరియల్ లో హరికి మంచి రోల్ ఇస్తూ ప్రోత్సహించేవాడు.
ఆలా టీవీ సీరియల్స్ లో హరిని చూడగానే ఈ సీరియల్ లో విలన్ హరి అని అర్ధం అయ్యేలా అందరి మనస్సులోకి వెళ్ళిపోయాడు. టీవీ సీరియల్స్ తో మంచి గుర్తిపు ను సంపాదించటమే కాకుండా ఆర్ధికంగా కూడా మంచి స్థితికి చేరుకున్నారు హరి. ఇలాగే మంచి మంచి పాత్రలను వేస్తూ అభిమానులను అలరించాలని కోరుకుందాం.