Healthhealth tips in teluguKitchen

1 గ్లాస్ పాలు తాగితే శారీరక బలహీనత,నీరసం తగ్గి 60 లో కూడా 20 లో వలె బలంగా ఉంటారు

Energy Milk benefits in telugu : ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఉదయం లేవగానే అలసట, నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు లేకుండా రోజంతా హుషారుగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే పాలను ఉదయం సమయంలో తాగాలి. అలాగే ఈ పాలు రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా చాలా మంచి పలితాన్ని అందిస్తాయి.
cashew nuts Side effects in telugu
మనం ఆరోగ్యంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతున్నారు. ఈ రోజు అలసట లేకుండా బలంగా,ఆరోగ్యంగా ఉండటానికి ఒక మంచి పాలను తయారు చేసుకుందాం. వారంలో మూడు సార్లు తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది.

ఒక బౌల్ లో 10 జీడిపప్పులు,4 అంజీరాలు,4 గింజలు తీసిన ఖర్జూరం,10 కిస్ మిస్ వేసి అరకప్పు పాలు పోసి రెండు గంటలు నానబెట్టాలి. 6 బాదం పప్పులను నీటిలో నానబెట్టి తొక్క తీసి రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్ లో తొక్క తీసిన బాదం పప్పు, నానబెట్టిన డ్రై ఫ్రూట్ లు, మూడు యాలకులు వేసి మిక్సీ చేయాలి.
Fig Fruit Benefits in telugu
ఆ తర్వాత ఒక కప్పు పాలను పోసి బాగా మిక్సీ చేసి గ్లాస్ లో పోసి సర్వ్ చేయటమే. ఈ పాలను వారంలో రెండు సార్లు తాగితే శారీరక బలహీనత,నీరసం తగ్గి ఉషారుగా ఉంటారు. అంతేకాక ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గటానికి బాగా సహాయపడుతుంది. ఈ Energy Milk లో వేసిన అన్నీ ఇంగ్రిడియన్స్ లోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి.
Diabetes patients eat almonds In Telugu
రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతి రోజు తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య నుండి బయట పడతారు. రక్తహీనత సమస్యను అసలు అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ చేస్తే ఎన్నో రకాల సమస్యలకు కారణం అవుతుంది. ఈ పాలను చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తాగవచ్చు. సీజనల్ గా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.