ఈ కషాయం తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ లను రెండు రోజుల్లో తరిమికొడుతుంది
Cold And Cough Home Remedies In telugu :ఈ సీజన్లో విపరీతమైన చలి, మంచు కారణంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు తొందరగా తగ్గవు. అలాగే మందులు వేసుకున్న అంత సులభంగా తగ్గవు. ఇంటిలో ఒకరికి వచ్చాయంటే మిగిలిన అందరికీ చాలా ఈజీగా అంటుకుంటాయి.
ఇప్పుడు చెప్పే ఈ కషాయం తీసుకుంటే కేవలం రెండు రోజుల్లోనే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ కషాయం తయారు చేయడానికి ఒక పొడి తయారు చేసుకోవాలి. మిక్సీ జార్ లో ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ వాము, అర స్పూన్ జీలకర్ర, మూడు యాలకులు, ఐదు మిరియాలు వేయాలి.
ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క, అర స్పూను శొంటి పొడి, 5 లవంగాలు వేసి మెత్తని పొడిగా మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని సీసాలో పోసి నిల్వ చేసుకుంటే పది రోజులు వరకు నిల్వ ఉంటుంది. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీరు కాస్త వేడెక్కాక తయారు చేసి పెట్టుకున్న ఒక స్పూను పొడిని వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మరిగించాలి.
ఆ తర్వాత ఆ నీటిని స్ట్రైనర్ సహాయంతో వడగట్టాలి ఈ కషాయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఉదయం అర గ్లాసు సాయంత్రం అర గ్లాసు మోతాదులో తీసుకుంటే దగ్గు, జలుబు రెండు రోజుల్లోనే తగ్గిపోతాయి. శ్వాసకు సంబంధించిన సమస్యలు అన్ని తొలగిపోతాయి. ఆస్తమా ఉన్నవారికి కూడా ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.
అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజనల్ గా వచ్చే అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఈ పొడిలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. ఈ పొడిని టీలో కూడా కలిపి తాగవచ్చు. కాబట్టి ఈ పొడిని తయారుచేసుకొని ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.