చలి కాలంలో నల్ల మిరియాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా ?
jaggery and Black pepper benefits In Telugu : ఈ సీజన్ లో తీసుకోవలసిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ లో వచ్చే సమస్యలకు ఆహారం అనేది కీలకం అని చెప్పవచ్చు. మనం దాదాపుగా ప్రతి రోజు మిరియాలు, బెల్లం రెండింటిని వాడుతూ ఉంటాం. ఈ సీజన్ లో మన ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.
బెల్లం, నల్ల మిరియాలు రెండింటిలోనూ ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి. బెల్లం, నల్ల మిరియాల్లో ఎక్కువగా వేడి చేసే లక్షణం ఉంటుంది. అందువలన ఈ చలికాలంలో ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.
ఈ చలి కాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి చాలా తొందరగా వచ్చేస్తాయి. ఒక్కసారి వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు. 3 మిరియాల గింజలు కొంచెం బెల్లం తీసుకుని ఈ రెండింటినీ కలిపి పేస్ట్ గా చేసి తీసుకుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి అన్ని తగ్గిపోతాయి. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవాలి.
కొంతమందికి ముక్కునుండి రక్తం కారుతూ ఉంటుంది. ఈ సమస్య తగ్గాలంటే పెరుగులో కొంచెం బెల్లం, మిరియాల పొడి కలిపి తీసుకుంటే ముక్కు నుండి రక్తం కారటం తగ్గిపోతుంది. ఈ మిశ్రమం తలనొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.
ఈ మధ్యకాలంలో కీళ్ల నొప్పులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ప్రతిరోజు బెల్లం, మిరియాల పొడి మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. మిరియాలలో ఉండే లక్షణాలు కీళ్ల నొప్పులు తగ్గించటానికి సహాయపడుతుంది. కాబట్టి మిరియాలు, బెల్లం కలిపి తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.