Healthhealth tips in teluguKitchen

డయాబెటిస్ ఉన్న వారు కొర్రలు తింటే ఏమి అవుతుందో తెలుసా ?

Korralu Health Benefits In Telugu : ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా మిల్లెట్స్‌ తినటం అలవాటుగా చేసుకుంటున్నారు. మిల్లెట్స్‌ ఆరోగ్యానికి మంచివి. ముఖ్యంగా కొర్రలను సూపర్‌ఫుడ్‌గా చెప్పవచ్చు. ఈ ఆధునిక జీవితంలో మంచి ఆరోగ్యాన్ని అందించే కొర్రలను చాలా మంది ఆహారంలో బాగంగా చేసుకుంటున్నారు.
Diabetes diet in telugu
ఒకప్పుడు కొర్రలను పల్లెలలో మాత్రమే వాడేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. కొంత మంది తక్కువ పరిమాణంలో కొర్రలను బియ్యంలో కలిపి అన్నంలా వండి తినేవారు. డయాబెటిస్ ఉన్నవారికి కొర్రలు చాలా బాగా సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
korralu
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఈ విధంగా తినేవారు. కొర్రలకు డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే శక్తి ఉండటం వలన కొర్రలను వాడటం ఎక్కువైంది. కొర్రలలో పీచు సమృద్దిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి డయబెటిస్, అధిక బరువు నియంత్రణలోను సహాయపడుతుంది. కొర్రల్లో 8 శాతం ఫైబర్‌ ఉంటుంది. 12 శాతం ప్రొటీన్లు ఉంటాయి.
Top 10 iron rich foods iron deficiency In Telugu
కొర్రలలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. రాల బలహీనత, బీపీ ఉండేవారికి, ఆస్తమా ఉండే వారు కొర్రల్ని తింటే ఆ సమస్యల నుండి బయట పడవచ్చు. నాడీవ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపే మోరెల్ విటమిన్ వీటిలో లభిస్తుంది. మానసిక దృక్పథానికి మద్దతు ఇస్తుంది.
Brain Foods
అలాగే జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచి వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ ని తగ్గిస్తుంది. కొర్రలలో ఉండే ప్రోటీన్ నాడీ వ్యవస్థ పనితీరు సజావుగా సాగేందుకు సాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో నాడీ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. కొర్రలను అన్నంగా వండుకోవచ్చు. లేదా పిండిగా తయారుచేసుకొని అట్లు వంటి వాటిని కూడా వేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.