Vetagadu సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

NTR Vetagadu Movie Songs In Telugu :NTR హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన వేటగాడు మూవీ అప్పట్లో ఓ క్రేజీ మూవీ. 50 డేస్ కి కోటి రూపాయలు వసూలు చేసింది. 29సెంటర్స్ లో 100డేస్, 6సెంటర్స్ లో రజతోత్సవం, 3సెంటర్స్ లో ఏడాది ఉత్సవం చేసుకుంది. మద్రాసు కోరమాండల్ లో 100రోజుల వేడుకకు ఎన్టీఆర్, అక్కినేని ముఖ్య అతిధులుగా వచ్చారు.

యుగ పురుషుడు మూవీ తీస్తుండగా నిర్మాత అశ్విని దత్ దగ్గరకు నిర్మాత అర్జునరాజు వెళ్లారు. అప్పుడే ఎన్టీఆర్ తో పరిచయం కల్గింది. చాలాసేపు ఎన్టీఆర్ మాట్లాడడంతో ఉబ్బితబ్బిబ్బైన అర్జునరాజు అప్పట్లో ప్రతిరోజూ షూటింగ్ కి వెళ్లి ఎన్టీఆర్ ని కలుస్తూ ఉండేవారు. ఓ సినిమా చేయాలని ఉందని చెప్పగానే ఎన్టీఆర్ ఒకే చెప్పినా, డేట్స్ ఏడాది దాకా లేవు.

దాంతో ఎన్టీఆర్ తో మూడు సినిమాలు తీసిన నిర్మాత తోట సుబ్బారావు దగ్గర డేట్స్ లాక్ అయ్యాయని తెల్సి, ఆయనకు కొంత మొత్తం చెల్లించి ఆడెట్స్ అర్జునరాజు తీసుకున్నారు.రాఘవేంద్రరావు ని డైరెక్ట్ చేయమని అర్జునరాజు అడిగారు. అప్పటికే అడవి రాముడు, కేడి నెంబర్ వన్, డ్రైవర్ రాముడు వంటి సినిమాలు ఎన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించారు.

దాంతో కొత్త సినిమాపై కసరత్తు మొదలైంది. హీరో వేటకు వెళ్లి పులిని కాపాడతాడు. ఆ పులి ఊళ్లోకి వస్తుంది. ఇలా లైన్ చెప్పి కథ రెడీ చేయమనడంతో జంధ్యాల సిద్ధం అయ్యారు. దానికి శమంతకమణి స్టోరీ ని లింక్ చేసి కథ అల్లారు. జయప్రద, జయసుధ, వాణిశ్రీ లాంటి వాళ్ళు ఎన్టీఆర్ సరసన చేయడంతో వీళ్లల్లో ఎవరో ఒకరు హీరోయిన్ అనుకుంటే పదహారేళ్ళ వయస్సులో హీరోయిన్ గా చేసిన శ్రీదేవిని సెలెక్ట్ చేయాలని రాఘవేంద్రరావు సూచించారు.

బడిపంతులు మూవీలో ఎన్టీఆర్ మనవరాలిగా వేసిన శ్రీదేవి హీరోయినా అని నిర్మాత విస్తుపోయారు. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తే శ్రీదేవి ఎవరు అని అడిగారు. బడిపంతులులో మనవరాలిగా వేసిన అమ్మాయి అని చెప్పడంతో ,ఆశ్చర్యపోతూ మీకు ఒకే అయితే మాకు ఒకే అని ఎన్టీఆర్ అన్నారు. ఆకుచాటు పిందె తడిసె పాటతో షూటింగ్ స్టార్ట్. అయితే అప్పటికే జ్వరంతో ఉన్నా సరే, శ్రీదేవి వానపాటలో యాక్ట్ చేసింది. రికార్డింగ్ థియేటర్లో పాట చూసి నిర్మాత అర్జునరాజు ఆనందంతో రాఘవేంద్రరావుని అభినందించారు.

33లక్షలతో 32రోజుల్లో సినిమా తీశారు. 1979జులై 5న 40ప్రింట్లతో రిలీజయింది. సూపర్ డూపర్ హిట్. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తికి ఇమేజ్, డాన్స్ మాస్టర్ సలీం కి డిమాండ్ పెంచేసింది. ఓసిసి కోడిపెట్ట పాటలో ఎన్టీఆర్, శ్రీదేవి స్టెప్స్ వేస్తుంటే, సత్యనారాయణ ఏడవడం బాగా పేలింది. రావు గోపాలరావు ప్రాస నియమంతో చెప్పే డైలాగ్స్ జంధ్యాల మార్క్ ని మరోసారి చాటాయి.