Healthhealth tips in teluguKitchen

జీలకర్రను ఎక్కువగా వాడుతున్నారా… ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు

Cumin Seeds Side Effects In telugu: జీలకర్రలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కార్బోహైడ్రేట్లు,విటమిన్స్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, డైటరీ ఫైబర్, నియాసిన్, ఫోలేట్ ఇందులో ఉంటాయి. జీలకర్ర వంటలకు మంచి రుచిని అందిస్తుంది. ప్రతి రోజు వంటలలో జీలకర్రను దాదాపుగా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు.
cumin seeds
జీలకర్ర తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఎన్నో ఇంటి చిట్కాలలో జీలకర్రను ఉపయోగిస్తూ ఉంటాం. జీలకర్రను లిమిట్ గా వాడితే వాటిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. జీలకర్రను ఎక్కువగా వాడితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
gas troble home remedies
జీలకర్రకు వేడి కలిగించే గుణం ఉంటుంది. అందువల్ల కడుపులో మంటగా అనిపిస్తే, ఆహారంలో జీలకర్రను ఎక్కువగా వాడకూడదు . జీలకర్ర ఎక్కువగా తినడం వల్ల కడుపులో మంట పెరుగుతుంది. అలాగే గ్యాస్, పుల్లటి నొప్పులు ఉన్నవారు కూడా జీలకర్రకు దూరంగా ఉంటేనే మంచిది. ఒకవేళ జీలకర్రను తీసుకుంటే సమస్య తీవ్రం అవుతుంది.

గర్భధారణ సమయంలో కూడా జీలకర్రను అధికంగా తీసుకోవడం మానేయాలి. ఇది గర్భధారణపై ప్రభావం చూపుతుంది. గర్భధారణ సమయంలో జీలకర్ర ఎక్కువగా తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. కిడ్నీలు దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంది మన శరీరానికి ఫిల్టర్ గా పనిచేసే కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది అందువలన లిమిట్ గా తీసుకోవాలి.
Weight Loss Drink In Telugu
బరువు తక్కువగా ఉన్నవారు జీలకర్రను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే జీలకర్రలో ఉన్న పోషకాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. జీలకర్రను తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు. కాబట్టి జీలకర్ర తీసుకొనే ముందు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.